అరస్ సెనాట్ కారులో కలిసి ప్రయాణించిన మోడీ-పుతిన్

బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన పుతిన్, ఆయన కారు ''అరస్ సెనాట్''లో మోడీతో కలిసి ప్రయాణించారు. శనివారం బ్రిక్స్ సమావేశాలు ప్రారంభం అవ్వడానికి ఒక రోజు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. గతేడాది చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా కూడా మోదీ, పుతిన్ ఇదే కారులో కలిసి ప్రయాణించారు. భారత మండపంలో భారత్-రష్యా ద్వైపాక్షిక చర్చలకు హాజరైన ఇద్దరు నేతలు, అక్కడి నుంచి ఒకే కారులో ఇన్నోప్రామ్ కార్యక్రమానికి వెళ్లారు. మరోసారి పుతిన్, మోడీ కారు ప్రయాణం ప్రపంచాన్ని ఆకర్షించింది. గత కొన్ని దశాబ్ధాలుగా భారత్‌కు రష్యా అత్యంత నమ్మకమైన, మిత్రదేశంగా కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో రక్షణ, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పురోగమిస్తున్నాయి. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం