పొన్నూరులో ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రేమ వ్యవహారాలకు తల్లి అడ్డుగా ఉండడంతో ఆమెను కన్న కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్యాబిన్ పేటలో ఈవూరి లక్ష్మీ తన కూతురు పుష్పలతతో కలిసి ఉంటుంది. కూతురు రాజా అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ప్రేమ వ్యవహారాలకు తల్లి అడ్డుగా ఉండడంతో తొలగించుకోవాలని కూతురు ప్రియుడితో ప్రణాళిక రచించింది. గత అర్థరాత్రి ఈవూరి లక్ష్మీ అనుమానాస్పదంగా చనిపోవడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుష్పలత తన ప్రియుడితో కలిసి కూతురును హత్య చేసిందని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పుష్పలతను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Post a Comment