ప్రపంచ రికార్డు నెలకొల్పిన సౌతాఫ్రికా బ్యాటర్ కానర్ ఎస్టర్‌హుయిజెన్ : 110 బంతుల్లో 119 పరుగులు
న మీబియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్, వికెట్‌కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్‌హుయిజెన్ సూపర్ శతకం (110 బంతుల్లో 119; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) చేశాడు. దీనితో అతడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో నమీబియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు. ఎస్టర్‌హుయిజెన్‌కు ముందు ఈ రికార్డు యూఏఈకి చెందిన వ్రిత్య అరవింద్ (115*) పేరిట ఉండేది. ఎస్టర్‌హుయిజెన్ శతకంతో పాటు టోనీ డి జోర్జి (79) అర్ద సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ (335-9) స్కోర్ చేసింది. నమీబియా బౌలర్లలో జాక్ బ్రసెల్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ఆదిలోనే చేతులెత్తేసింది. ఒక్క పరుగుకే 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే కూడా ఓడిన నమీబియా 0-1తో వెనుకపడిపోయింది. ఈ మ్యాచ్ కూడా ఓడితే ఆ జట్టు సిరీస్‌ను కోల్పోతుంది. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా నమీబియాలో పర్యటిస్తుంది. ఎస్టర్‌హుయిజెన్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నమీబియా సిరీస్‌కు ముందు అద...