Posts

Showing posts with the label Key Meeting Between Leaders of Iran and the UAE

బ్రిక్స్ సమావేశాలు : ఇరాన్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేతల కీలక భేటీ

Image
న్యూ ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రౌన్ ప్రిన్స్ షేక్‌ ఖాలెద్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు దేశాధినేతల మధ్య చర్చల్ని కీలక పరిణామంగా చెబుతున్నారు. శనివారం ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయిల్‌లు కలిసి ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ యూఏఈలోని దుబాయ్, అబుదాబితో పాటు పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇరాన్, యూఏఈ మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో ఈ చర్చలు పరిష్కారానికి మార్గాన్ని సుగమం చేస్తాయని భావిస్తున్నారు. గతంలో ఇరాన్ తమపై చేస్తున్న దాడుల్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించే చర్చల్ని సహించేది లేదని, అవసరమై ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. మరోవైపు, అమెరికాకు ఆశ్రయం ఇచ్చే దేశాలను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే యూఏఈ...