ఊహించని విధంగా వసూళ్లు రాబడుతున్న మండాడి
మండాడి సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లు రాబడుతోంది. బడా చిత్రాలు థియేటర్‌లలో ఉన్నప్పటికీ తన మార్క్ చూపిస్తోంది. కథ, కథనానికి తోడు సుహాస్- సూరిల నటనకు తెలుగు, తమిళ ప్రేక్షకులు మండాడికి బ్రహ్మరథం పడుతున్నారు. సెప్టెంబర్ 10న మండాడి చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. మండాడిలో మహిమా నంబియార్, సత్యరాజ్, మిథున్, జై శంకర్, రవీంద్ర విజయ్, బాల శరవణన్, స్టన్ శివ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాథిమారన్ పుగళేంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆర్ఎస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్‌రెడ్ కుమార్, వెట్రీమారన్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఆర్ కథిర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ప్రదీన్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. మండాడి చిత్రాన్ని 70 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. తొలిరోజు సూరి మూవీకి 4.85 కోట్ల రూపాయలు, రెండో రోజు 6.55 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో రెండ్రోజుల్లో 11.40 కోట్ల రూపాయల నెట్.. 13.35 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఇప్పటి వరకు తమిళనాడులో 9.65 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 2.40 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.05 కోట్ల రూపాలు, కేరళలో 35 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 20 లక్షల రూపాయలు చొప్పున మండాడి వసూలు చేసింది. సుహాస్ హీరో కావడం, సూరికి ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోన మండాడికి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన సర్దార్ 2ను మించి తెలుగు రాష్ట్రాల్లో మండాడి బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తోంది. మొదటి రోజు కోటి రూపాయలు, రెండో రోజు 1.35 కోట్ల రూపాయలు చొప్పున ఇక్కడ రాబట్టింది మండాడి. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో సూరి మూవీకి మరిన్ని వసూళ్లు లభిస్తాయని భావిస్తున్నారు. నార్త్ అమెరికాలో ఇప్పటికే పలు దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ సినిమాల హవా కనిపిస్తోంది. అంతటి పోటీలోనూ మండాడికి చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు ఇప్పటి వరకు 50K డాలర్లు (47.77 లక్షల రూపాయలు) వసూలైంది. సింగపూర్, మలేషియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూకే, యూరప్ తదితర దేశాలలో కలిపి మండాడి ఓవర్సీస్‌లో 2.50 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. భారత్‌లో వచ్చిన కలెక్షన్స్ కలిపి మండాదికి వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 15.85 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. వరుస సెలవులు కావడంతో బుకింగ్స్‌లో ఊపు కనిపిస్తోంది. శనివారం మండాడి మూవీకి ఇండియాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 1477 కు పైగా షోలు ప్రదర్శితమై 1.80 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు మరింత మెరుగైన కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు 3వ రోజు మండాడి మూవీకి తమిళనాడులో 5 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 7 నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్‌లో కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
Comments
Post a Comment