సెప్టెంబర్ 16న ఒప్పో కే-14 లైట్ విడుదల
దేశీయ మార్కెట్లో సెప్టెంబర్ 16న ఒప్పో కే-సిరీస్ లో కే-14 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. రోజువారీ వినియోగంతో పాటు ఎక్కువ కాలం మన్నిక కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను కంపెనీ తీసుకొస్తోంది. దీనిలో 7,000mAh బ్యాటరీ అందించనుంది. ఈ బ్యాటరీ సుమారు ఆరు సంవత్సరాల పాటు మన్నికగా పనిచేసేలా రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లే ఉంటుంది. అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, యానిమేషన్లు, ఇతర రోజువారీ పనులు స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. అలాగే బయట ప్రకాశవంతమైన వాతావరణంలో స్క్రీన్‌ను సులభంగా చూడటానికి డిస్‌ప్లేను రూపొందించారు. ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ లభించింది. దీంతో దుమ్ము, రోజువారీ వినియోగంలో ఎదురయ్యే నీటి చినుకులు, స్వల్ప స్ప్లాష్‌ల నుంచి రక్షణ లభించనుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ కలర్‌ఓఎస్ 16తో నేరుగా అందుబాటులోకి రానుంది. మెరుగైన సిస్టమ్ పనితీరు, స్మూత్ ఆపరేషన్, కొత్త ఇంటర్‌ఫేస్ ఫీచర్లను ఇందులో అందించనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. ఫెదర్ పర్పుల్, స్టోన్ బ్రౌన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభించనుంది.
Comments
Post a Comment