Posts

అమెరికాలో రన్‌వేపై కుప్పకూలిన చిన్న విమానం : ఇద్దరు సజీవ దహనం

Image
అ మెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియేగో నగరం మాంట్‌గోమెరీ - గిబ్స్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయంలో ఒక చిన్న తరహా విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. విమానాశ్రయం పరిధిలో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో 'సెస్నా స్కైహాక్' రకానికి చెందిన చిన్న విమానం అదుపుతప్పి తీవ్ర వేగంతో రన్‌వే సమీపంలో నేలను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో భారీ ఎత్తున మంటలు చెలరేగి క్షణాల వ్యవధిలోనే క్యాబిన్ మొత్తాన్ని దట్టమైన పొగ, అగ్నికీలలు చుట్టుముట్టాయి. విమానం నేలను తాకగానే ఎగసిపడిన మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు బయటకు రాలేక అక్కడికక్కడే సజీవదహనమయ్యారని అత్యవసర సహాయక సిబ్బంది, స్థానిక విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ అగ్నిమాపక దళాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ప్రాణ నష్టం జరిగిపోయింది. ఈ ఘోర ప్రమాదానికి గల సాంకేతిక లోపాలు లేదా ప్రతికూల పరిస్థితులపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అధికారులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించ...

నిర్మాతగా మారిన యాంకర్ ఉదయభాను : రేపటి నుంచి జీ5లో 'పంచనామా' స్ట్రీమింగ్

Image
తె లుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో, నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి ఉదయభాను ఇప్పుడు సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆమె మొదటిసారి నిర్మాతగా మారి 'పంచనామా' అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్ రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఉదయభాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈవెంట్‌లో మాట్లాడుతూ ఉదయభాను కన్నీటిపర్యూమ అయ్యారు. తాను ఎంతగానో భావోద్వేగాన్ని అదుపు చేసుకోవాలని అనుకున్నానని, కానీ అస్సలు కుదరలేదని తెలిపారు. నిర్మాతగా మారాలని తాను దాదాపు 15 ఏళ్లుగా ఎంతో తపస్సు చేశానని చెప్పుకొచ్చారు. తన ప్రయాణం టెలివిజన్‌లోనే ప్రారంభమైందని, ఇక్కడే ఉదయభాను అందరి హృదయభానుగా మారిందని గుర్తుచేసుకున్నారు. అందుకే నిర్మాతగా కూడా టెలివిజన్‌తోనే అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.  మంచి కంటెంట్ ఉందని ఎంతోమందిని కలిసినప్పటికీ పనులు ముందుకు పడలేదని వాపోయారు. వచ్చే నెల, వచ్చే వారం అంటూ కాలం గడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇన్నేళ్లు ఎందుకు ఆలస్యమైందనేది తనకూ అంతు...

ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Image
హై దరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌ ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌డీ డిజిటల్ హ్యూమన్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ నారాయణ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రితేష్ శ్రీవాస్తవ, తెలంగాణ ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో సర్వేశ్ సింగ్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగం పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా నూతన శకంలోకి అడుగుపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో 2,000కు పైగా కంపెనీలతో సంపూర్ణమైన లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ ఉందని, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని తెలిపారు. అంతేకాకుండా అమెరికా వెలుపల అత్యధిక యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం కేవలం ఔషధ తయారీకే పరిమితం కాకుండా అధునాతన ఆర్‌ అండ్‌ డీ, గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల దిశగా దూసుకుపోతోందని చెప్పారు. గత రెండేళ్ల కాలంలో ఆమ్‌జెన్, ఎలీ లిల్లీ, బ్రి...

ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 11 నుంచి పోకో ఎక్స్‌8 సిరీస్‌ అమ్మకాలు ప్రారంభం !

Image
రే పటి నుంచి  ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎక్స్‌8 సిరీస్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. పోకో ఎక్స్‌8 ప్రారంభ ధర రూ.29,999 కాగా, ఎక్స్‌8 పవర్ బేస్ వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. అయితే లాంచ్ ఆఫర్లతో ఈ ఫోన్‌ల ఎఫెక్టివ్ ప్రారంభ ధరలు వరుసగా రూ.26,999 మరియు రూ.32,999కి తగ్గుతాయి. కొనుగోలుదారులకు రూ.2,000 కూపన్ ఆఫర్‌తో పాటు రూ.1,000 బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 12 నెలల నో-కాస్ట్ ఈఎమ్‌ఐ సదుపాయం కూడా ఉంది. ఈ నో-కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్‌లో పోకో ఎక్స్‌8 నెలకు రూ.2,250 నుంచి, ఎక్స్‌8 పవర్ నెలకు రూ.2,750 నుంచి ప్రారంభమవుతుంది. ఆర్డర్ చేసే ముందు మీ పిన్‌కోడ్ ఆధారంగా డెలివరీ సమయం, నచ్చిన కలర్ స్టాక్‌ను ఒకసారి సరిచూసుకోండి. పోకో ఎక్స్‌8 మోడల్ ఆరెంజ్, వైట్ కలర్స్‌లో దొరుకుతుండగా.. ఎక్స్‌8 పవర్ మోడల్ విగన్-లెదర్ టెక్స్చర్‌తో పోకో ఎల్లో, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్‌లలోనూ 6.83-అంగుళాల 1.5K 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉన్నాయి. వీటితో పాటు స్టీరియో స్పీకర్లు, IP66, IP68, IP69, IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స...

మార్ఫింగ్ ఫొటోలంటూ నమ్మబలుకుతూ ప్రజలను నిస్సిగ్గుగా తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్ : ప్రభుత్వ విప్ వేముల వీరేశం

Image
తె లంగాణ శాసనసభ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విలేకరులతో మాట్లాడుతూ అమెరికా నుంచి వచ్చిన ఆల్ ఇండియా లీడర్ కేటీఆర్, మీడియాలో స్పష్టమైన ఆధారాలతో వస్తున్న వాస్తవ కథనాలను సైతం కృత్రిమ మేధస్సు చిత్రాలని, మార్ఫింగ్ ఫొటోలంటూ నమ్మబలుకుతూ ప్రజలను నిస్సిగ్గుగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం ఉన్న కేటీఆర్, హరీశ్ రావులకు సభా నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. చట్టసభల మర్యాదలు తెలిసి కూడా పోలీసులపై దాడికి పాల్పడటం, అనుచితంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. శాసనసభలో అత్యంత కీలకమైన 22-ఏ భూముల అక్రమాలపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో నిలబడి సమాధానం చెప్పే ధైర్యం లేకనే కేటీఆర్ చర్చ నుంచి పారిపోయారని వీరేశం ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో భారీ ఎత్తున భూదోపిడీ, విధ్వంసం జరిగాయని, కేటీఆర్ మరియు ఆయన బంధువులు లాజిస్టిక్స్ పార్కుల పేరుతో వందల ఎకరాల విలువైన భూములను కబ్జా చేసి మింగేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి భూ కుంభకోణంపై తమ కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను ప్...

బోడుప్పల్‌ టిఫిన్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం

Image
తె లంగాణలోని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌ ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటల తీవ్రతకు టిఫిన్‌ సెంటర్‌లోని సుమారు రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలినట్లు సమాచారం. దీంతో మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫుడ్‌ కోర్టులకు వ్యాపించడంతో అవి కూడా పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే మూడు ఫుడ్‌ సెంటర్లకు భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టం వివరాల పై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

రూ.15 కోసం ప్రొఫెసర్‌పై కత్తితో దాడి !

Image
బీ హార్‌లోని ఛాప్రా నగరంలో చిల్లర విషయంలో తలెత్తిన వివాదంలో కేవలం రూ. 15 కోసం ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై దుకాణదారుడి కుమారుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నంద్ లాల్ సింగ్ కళాశాలలో ఫిలాసఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భగవాన్ ఠాకూర్, రోజూలాగే స్థానిక దుకాణానికి అర లీటరు పాలు కొనుగోలు చేయడానికి వెళ్లారు. పాలు తీసుకున్న అనంతరం దుకాణదారుడికి రూ. 500 నోటు ఇవ్వగా, సదరు వ్యాపారి రూ. 450 తిరిగి ఇచ్చాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత లెక్క చూసుకోగా, తనకు రావాల్సిన దాంట్లో రూ. 15 తక్కువగా వచ్చినట్లు ప్రొఫెసర్ గుర్తించారు. వెంటనే తిరిగి దుకాణం వద్దకు వెళ్లి ఆ విషయాన్ని దుకాణదారుడి దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడి మాటలతో వ్యాపారి ఆ రూ. 15 తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ప్రొఫెసర్ ఆ డబ్బులు తీసుకోబోతుండగా, దుకాణదారుడి కుమారుడు వెనుక నుంచి ఆకస్మికంగా వచ్చి పదునైన కత్తితో ప్రొఫెసర్ చెవిపై బలంగా పొడిచాడు. ఈ దాడితో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన ప్రొఫెసర్ భగవాన్ ఠాకూర్, ...