ఓవర్ ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ ప్రో ను విడుదల చేసిన సీఎంఎఫ్
తొలి ఓవర్ ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ గా సీఎంఎఫ్ హెడ్ ఫోన్ నిలిచింది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 100 గంటల ప్లేబ్యాక్ టైం ను పొందవచ్చని సంస్థ చెబుతోంది. ఈ సీఎంఎఫ్ హెడ్ ఫోన్ 40mm డ్రైవర్‌లను కలిగి ఉంది. 40dB హైబ్రిడ్ అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కి సపోర్టు చేస్తుందని సీఎంఎఫ్ సంస్థ తెలిపింది. Hi-Res ఆడియో, LDAC కోడిక్ ను సపోర్టు చేస్తుంది. ఈ హెడ్‌ఫోన్స్ సినిమా, కాన్సర్ట్ మోడ్స్ తో కూడిన స్పేషియల్ ఆడియోను సపోర్టు చేస్తుంది. అవసరం అయిన సమయంలో మార్పుకొనేందుకు అవకాశం ఉన్న ఇయర్ కుషన్స్ ను కలిగి ఉంది. టచ్ కంట్రోల్ కు బదులుగా ఫిజికల్ కంట్రోల్స్ ను కలిగి ఉంది. సీఎంఎఫ్ హెడ్‌ఫోన్ ప్రో మోడల్ రోలర్ డయల్ ను కలిగి ఉంది. దీంతో వాల్యూమ్, ప్లేబ్యాక్, నాయిస్ కంట్రోల్స్ ను నియంత్రించవచ్చు. ఎనర్జీ స్లైడర్, కస్టమైజబుల్ బటన్ తో అందుబాటులోకి వచ్చింది. సౌండ్ సెట్టింగ్స్, సౌండ్ ప్రొఫైల్ ఆధారంగా వీటిలో మార్పులు చేసుకోవచ్చు. యాప్‌తోనూ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా ఈ సీఎంఎఫ్ హెడ్‌ఫోన్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 100 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని పొందవచ్చు. అయితే ANC ఆఫ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్లేబ్యాక్ టైం సాధ్యమవుతుందని సంస్ష తెలిపింది. అయితే ANC వినియోగిస్తున్న సమయంలో సింగిల్ ఛార్జింగ్ పై 50 గంటల ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు. అదే విధంగా కేవలం 5 నిమిషాల ఛార్జింగ్ తో 8 గంటల వరకు వినియోగించుకోవచ్చు. పూర్తిగా ఛార్జింగ్ చేసేందుకు 2 గంటల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది. USB-C ఛార్జింగ్ పోర్టును సపోర్టు చేస్తుంది. సీఎంఎఫ్ హెడ్‌ఫోన్ డార్క్ గ్రే, లైట్ గ్రీన్, లైట్ గ్రే కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ హెడ్‌ఫోన్ ధర రూ.7999 గా ఉంది. ప్రారంభ సేల్ లో భాగంగా రూ.6999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ కొన్ని రోజులపాటు మాత్రమే ఉంటుందని తెలిపింది. జనవరి 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, ఇతర ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.
Comments
Post a Comment