గూగుల్ 'ఫైండ్​ మై డివైజ్​ నెట్​వర్క్​​' ?


ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 'ఫైండ్​ మై డివైజ్​ నెట్​వర్క్​​' అనే ఫీచర్‌ను ఈరోజు గూగుల్ కంపెనీ లాంఛ్ చేయనుంది. దీనితో మనం పోగొట్టుకున్న ఫోన్​ ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు. మన ఫోన్‌ను దొంగ స్విచ్ఛాఫ్ చేసినా, దాని లొకేషన్‌ను ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ మన డివైజ్​లోని మొత్తం ఛార్జింగ్ అయిపోయినా.. దాని చివరి లొకేషన్​ను మనకు తెలియజేయడమే ఈ ఫీచర్ ప్రత్యేకత. దీన్ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్స్‌తో పాటు దానితో పెయిర్ చేసిన ఇయర్​బడ్స్, హెడ్​ఫోన్లకు కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఆండ్రాయిడ్​ ఫోన్​తో లింక్​ చేసి ఉన్న వాలెట్స్​, కీస్​, బైక్​ల జాడను కూడా కనిపెట్టొచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గూగుల్ Find My Device Appను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఉపయోగించి ఆండ్రాయిడ్​ ఫోన్లను ట్రాక్ చేయొచ్చు. కానీ ఎవరైనా ఆ ఫోన్​ను స్విచ్ఛాఫ్ చేస్తే.. దాని జాడను గుర్తించడం వీలుకాదు. ఈ లోపాన్ని అధిగమించడానికి 'ఫైండ్ మై డివైజ్ నెట్​వర్క్'ను ఇవాళ గూగుల్ లాంఛ్ చేయనుంది. యాపిల్ కంపెనీ 2019లో తొలిసారిగా బ్లూటూత్ బేస్డ్​ ట్రాకర్​ 'ఎయిర్​ట్యాగ్​'ను ప్రారంభించింది. అయితే అప్పట్లో ఈ ఫీచర్ కేవలం ఐఫోన్, ఐప్యాడ్​లకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత బ్లూటూత్ ఆధారిత ట్రాకర్​ను గుర్తించి, వాటిని తొలగించడానికి యూనివర్సల మెకానిజంతో ముందుకు రావడానికి యాపిల్ కంపెనీ గూగుల్​తో జతకట్టింది. శాంసంగ్​, టెలీ, చిపోలో, యూఫీ సెక్యూరిటీ, పెబ్బెల్​బీ లాంటి ఇతర బ్రాండ్​లు కూడా ఈ డ్రాఫ్ట్​ స్పెసిఫికేషన్​కు మద్దతునిచ్చాయి. దీంతో ఈ బ్రాండెడ్ డివైజ్​లు ఉపయోగించే వినియోగదారులు అందరూ, తమను అనుసరించే ట్రాకర్ల గురించి అలర్ట్​లు పొందే వీలు ఏర్పడింది. యాపిల్ కంపెనీ ఈ నెలాఖరులోగా ఐఓఎస్​ 17.5 అప్​డేట్​లో సరికొత్త యాంటీ-స్టాకింగ్ ఫీచర్​ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. గూగుల్ కంపెనీ కూడా ఇవాళ అదే సామర్థ్యం కలిగిన సరికొత్త 'ఫైండ్​ మై డివైజ్' నెట్​వర్క్ యాప్​ను తీసుకొస్తోంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం