Posts

Showing posts with the label ఆండ్రాయిడ్ ఫోన్లు

వైఫై పాస్‌వర్డ్‌ను తరచూ మర్చిపోతున్నారా ?

Image
వైఫై వినియోగిస్తున్న వారిలో అనేక మందికి ప్రతిసారి పాస్‌ వర్డ్‌ గుర్తు పెట్టుకొనే అవకాశం ఉండకపోవచ్చు. ప్రతి రోజు అదే వైఫై తో వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ లు లేదా ఇతర ట్యాబ్లెట్‌ లు ఆటోమేటిక్‌ గా కనెక్ట్‌ అయ్యేలా ఏర్వాటు చేసుకుంటాం. అయితే ఏదైనా సందర్భంగా కొత్త స్మార్ట్‌ ఫోన్‌ లేదా ట్యాబ్లెట్‌ కు కనెక్ట్‌ కావాలంటే కచ్చితంగా పాస్‌వర్డ్‌ గుర్తుండాలి. దీంతోపాటు ఇతరులకు మీ వైఫై పాస్‌వర్డ్‌ షేర్‌ చేయాలన్నా.. కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండవచ్చు. దీంతోపాటు వైఫై పాస్‌వర్డ్‌ను కాగితం మీద రాసి పెట్టి రూటర్‌ దగ్గర అతికిస్తే.. మీ అనుమతి లేకుండా ఎవరైనా వినియోగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఒక అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా వైఫై పాస్‌వర్డ్‌ ను గుర్తుపెట్టుకొనే అవసరం లేకుండా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇతరులకు షేర్‌ చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లు, ట్యాబ్లెట్‌ సెట్టింగ్స్‌ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఆండ్రాయిడ్ 10 కంటే అప్‌డేట్‌ వెర్షన్‌ లో మాత్రమే ఈ అవకాశం ఉంది. దీని ద్వారా మీరు వైఫై రేంజ్‌ లో ఉంటూ సులభంగా ఇతరులు.. మీ వైఫైను షేర్‌ చేయవచ్చు. అయితే...

గూగుల్ 'ఫైండ్​ మై డివైజ్​ నెట్​వర్క్​​' ?

Image
ఆం డ్రాయిడ్ యూజర్ల కోసం 'ఫైండ్​ మై డివైజ్​ నెట్​వర్క్​​' అనే ఫీచర్‌ను ఈరోజు గూగుల్ కంపెనీ లాంఛ్ చేయనుంది. దీనితో మనం పోగొట్టుకున్న ఫోన్​ ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు. మన ఫోన్‌ను దొంగ స్విచ్ఛాఫ్ చేసినా, దాని లొకేషన్‌ను ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ మన డివైజ్​లోని మొత్తం ఛార్జింగ్ అయిపోయినా.. దాని చివరి లొకేషన్​ను మనకు తెలియజేయడమే ఈ ఫీచర్ ప్రత్యేకత. దీన్ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్స్‌తో పాటు దానితో పెయిర్ చేసిన ఇయర్​బడ్స్, హెడ్​ఫోన్లకు కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఆండ్రాయిడ్​ ఫోన్​తో లింక్​ చేసి ఉన్న వాలెట్స్​, కీస్​, బైక్​ల జాడను కూడా కనిపెట్టొచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గూగుల్ Find My Device Appను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఉపయోగించి ఆండ్రాయిడ్​ ఫోన్లను ట్రాక్ చేయొచ్చు. కానీ ఎవరైనా ఆ ఫోన్​ను స్విచ్ఛాఫ్ చేస్తే.. దాని జాడను గుర్తించడం వీలుకాదు. ఈ లోపాన్ని అధిగమించడానికి 'ఫైండ్ మై డివైజ్ నెట్​వర్క్'ను ఇవాళ గూగుల్ లాంఛ్ చేయనుంది. యాపిల్ కంపెనీ 2019లో తొలిసారిగా బ్లూటూత్ బేస్డ్​ ట్రాకర్​ 'ఎయిర్​ట్యాగ్​'ను ప్రారంభించింది. అయితే అప్పట్ల...