వైఫై పాస్‌వర్డ్‌ను తరచూ మర్చిపోతున్నారా ?

Telugu Lo Computer
0


వైఫై వినియోగిస్తున్న వారిలో అనేక మందికి ప్రతిసారి పాస్‌ వర్డ్‌ గుర్తు పెట్టుకొనే అవకాశం ఉండకపోవచ్చు. ప్రతి రోజు అదే వైఫై తో వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ లు లేదా ఇతర ట్యాబ్లెట్‌ లు ఆటోమేటిక్‌ గా కనెక్ట్‌ అయ్యేలా ఏర్వాటు చేసుకుంటాం. అయితే ఏదైనా సందర్భంగా కొత్త స్మార్ట్‌ ఫోన్‌ లేదా ట్యాబ్లెట్‌ కు కనెక్ట్‌ కావాలంటే కచ్చితంగా పాస్‌వర్డ్‌ గుర్తుండాలి. దీంతోపాటు ఇతరులకు మీ వైఫై పాస్‌వర్డ్‌ షేర్‌ చేయాలన్నా.. కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండవచ్చు. దీంతోపాటు వైఫై పాస్‌వర్డ్‌ను కాగితం మీద రాసి పెట్టి రూటర్‌ దగ్గర అతికిస్తే.. మీ అనుమతి లేకుండా ఎవరైనా వినియోగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఒక అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా వైఫై పాస్‌వర్డ్‌ ను గుర్తుపెట్టుకొనే అవసరం లేకుండా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇతరులకు షేర్‌ చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లు, ట్యాబ్లెట్‌ సెట్టింగ్స్‌ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఆండ్రాయిడ్ 10 కంటే అప్‌డేట్‌ వెర్షన్‌ లో మాత్రమే ఈ అవకాశం ఉంది. దీని ద్వారా మీరు వైఫై రేంజ్‌ లో ఉంటూ సులభంగా ఇతరులు.. మీ వైఫైను షేర్‌ చేయవచ్చు. అయితే అవతలి వ్యక్తులకు గూగుల్‌ లెన్స్‌ లేదా కెమెరా యాప్‌ ద్వారా స్కాన్‌ చేసేందుకు అవకాశం ఉండాలి.

* ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో సెట్టింగ్స్‌ యాప్‌ ఒపెన్ చెయ్యాలి.

* అనంతరం నెట్‌వర్క్‌ మరియు ఇంటర్నెట్‌ పైన క్లిక్‌ చేయాలి.

* ఆ తర్వాత ఇంటర్నెట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* అక్కడ కనిపించిన నెట్‌వర్క్‌లలో మీకు కావాల్సిన దానిని ఎంచుకోవాలి.

* అనంతరం QR కోడ్‌ను గుర్తించవచ్చు.

ఈ QR కోడ్‌ ద్వారా కొత్త ఫోన్‌ లేదా ట్యాబ్లెట్‌ లో వైఫైను కనెక్ట్‌ చేయవచ్చు. కొత్త డివైస్‌ నుంచి గూగుల్‌ లెన్స్‌ లేదా కెమరా యాప్‌ ద్వారా కోడ్‌ స్కాన్‌ చేసి వైఫైకి కనెక్ట్‌ కావచ్చు. మీకు అవసరం అనుకుంటే ఈ QR కోడ్‌ను ఫ్రింట్‌ తీసుకొని భద్రపరచుకోవచ్చు. వైఫై పాస్‌వర్డ్‌ను గుర్తించేందుకు పైన తెలిపిన విధానంలో ప్రయత్నం చేయాలని భావిస్తే మీ ఫోన్‌ కచ్చితంగా ఆండ్రాయిడ్ 10 OS కంటే అప్‌ గ్రేడ్‌ వెర్షన్‌ గా ఉండాలని గుర్తించుకోండి. ఇతర వెర్షన్‌లలో ఈ పద్ధతిలో వైఫై పాస్‌వర్డ్‌ను గుర్తించేందుకు వీలు ఉండదు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default