Posts

బోడుప్పల్‌ టిఫిన్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం

Image
తె లంగాణలోని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌ ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటల తీవ్రతకు టిఫిన్‌ సెంటర్‌లోని సుమారు రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలినట్లు సమాచారం. దీంతో మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫుడ్‌ కోర్టులకు వ్యాపించడంతో అవి కూడా పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే మూడు ఫుడ్‌ సెంటర్లకు భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టం వివరాల పై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

రూ.15 కోసం ప్రొఫెసర్‌పై కత్తితో దాడి !

Image
బీ హార్‌లోని ఛాప్రా నగరంలో చిల్లర విషయంలో తలెత్తిన వివాదంలో కేవలం రూ. 15 కోసం ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై దుకాణదారుడి కుమారుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నంద్ లాల్ సింగ్ కళాశాలలో ఫిలాసఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భగవాన్ ఠాకూర్, రోజూలాగే స్థానిక దుకాణానికి అర లీటరు పాలు కొనుగోలు చేయడానికి వెళ్లారు. పాలు తీసుకున్న అనంతరం దుకాణదారుడికి రూ. 500 నోటు ఇవ్వగా, సదరు వ్యాపారి రూ. 450 తిరిగి ఇచ్చాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత లెక్క చూసుకోగా, తనకు రావాల్సిన దాంట్లో రూ. 15 తక్కువగా వచ్చినట్లు ప్రొఫెసర్ గుర్తించారు. వెంటనే తిరిగి దుకాణం వద్దకు వెళ్లి ఆ విషయాన్ని దుకాణదారుడి దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడి మాటలతో వ్యాపారి ఆ రూ. 15 తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ప్రొఫెసర్ ఆ డబ్బులు తీసుకోబోతుండగా, దుకాణదారుడి కుమారుడు వెనుక నుంచి ఆకస్మికంగా వచ్చి పదునైన కత్తితో ప్రొఫెసర్ చెవిపై బలంగా పొడిచాడు. ఈ దాడితో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన ప్రొఫెసర్ భగవాన్ ఠాకూర్, ...

సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 ?

Image
సె ప్టెంబర్ 23న ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 అవకాశం ఉందంటూ టెక్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది కూడా సెప్టెంబర్ 23నే సేల్ ప్రారంభమవగా, ప్లస్ మెంబర్లకు సెప్టెంబర్ 22నే 24 గంటల ముందస్తు యాక్సెస్ లభించింది. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ ఎర్లీ యాక్సెసే చాలా కీలకం. ఎందుకంటే బెస్ట్ డీల్స్ చాలా వరకు సేల్ మొదటి రోజే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంటాయి. ఈసారి కూడా బెస్ట్ ప్రైస్‌కే ఫోన్లను సొంతం చేసుకునేలా 'ఎర్లీ బర్డ్ డీల్స్', 'లోయెస్ట్ ప్రైస్ లాక్' వంటి ప్రీ-సేల్ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. "బిగ్ బిలియన్ డేస్ అనేది కేవలం ఒక షాపింగ్ ఈవెంట్ మాత్రమే కాదు.. ఇది భారతదేశపు సొంత సాధ్యతల పండుగ" అని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంటోంది. 2025 నిబంధనల ఆధారంగా చూస్తే, ఈసారి కూడా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించవచ్చు. కార్డుకు రూ.1,500 నుంచి రూ.1,750 వరకు గరిష్ట తగ్గింపు ఉండవచ్చు. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్ యూపీఐ గిఫ్ట్ కార్డ్ ఆఫర్లతో 5% వరకు అదనపు ఆదా చేసుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ, కార్డ్‌లెస్ ఈఎంఐ సదుపాయాలు కూడా అందు...

అల్లుడు కోసం రాజకీయ సన్యాసం ప్రకటించిన అశోక్ సిద్ధార్థ్

Image
మే నల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు బీఎస్పీలో మళ్లీ రాజకీయ అవకాశం కల్పించాలంటే అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని మాయావతి స్పష్టం చేయడంతో,  సోషల్ మీడియా వేదికగా అశోక్ సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం ప్రకటిస్తున్నట్లు గురువారం సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో ఆగస్టు 2న బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన సిద్ధార్థ్, ఈ పరిణామంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారారు. మాయావతిని తన రాజకీయ గురువుగా, అక్కగా అభివర్ణించిన సిద్ధార్థ్ "ప్రపంచంలో మరేదానికన్నా మీ ఆదేశమే నాకు ముఖ్యం. మీ ఆజ్ఞల ముందు నా వ్యక్తిగత సంబంధాలు, కుటుంబం కూడా చిన్నవే" అని లేఖలో పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా తనకు లభించిన అవకాశంపై కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశ్ ఆనంద్‌ను తప్పుదోవ పట్టించి పార్టీని నియంత్రించేందుకు యత్నించానన్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. పార్టీలో తనకు లభించిన ప్రాధాన్యతను చూసి ఓర్వలేక కొందరు సహచరులే తనపై కుట్రలు చేసి తప్పుడు ప్రచారం చేశారని సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన ఉద్యమం కోసం త్యాగం: "బహుజన ఉద్...

ఆర్టీసీ ఆపరేషనల్ నష్టాల నుంచి లాభాల దిశగా పయనిస్తోంది : శాసనసభలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Image
శా సనసభలో ఆర్టీసీపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుదీర్ఘంగా, వివరంగా సమాధానమిస్తూ గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా, రిటైర్డ్ ఈడీని ఎండీగా నియమించి సంస్థను నిర్వీర్యం చేసి నష్టాల బాటలోకి నెట్టిందని, అలాగే కార్మికుల సమస్యలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ఇది మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ఆర్టీసీకి కొత్త జీవం పోసిందని, ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగి బస్ స్టేషన్లలో రద్దీ పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలోని మహిళలు ఇప్పటివరకు 347.47 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించి, రూ.12,171 కోట్లు ఆదా చేసుకున్నారని వివరించారు. ఆసుపత్రులు, దేవాలయాలు, బంధువుల ఇళ్లకు, పిల్లల చదువుల కోసం ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. గత సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల వినతులకు అనుగుణంగా కొత్త సర్వీసులు, అదనపు ట్రిప్పులు ప్రారంభించామని,...

పశ్చిమ బెంగాల్‌ అటవీ ప్రాంతంలో ఒకే చోట నాలుగు మానవ అస్థిపంజరాలు లభ్యం

Image
ప శ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా కంకాసా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలాన్ దిఘి అటవీ ప్రాంతంలో ఒకే చోట నాలుగు మానవ అస్థిపంజరాలు లభ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లా మలాన్ దిఘి పరిధిలోని జాఠ్‌గఢియా మోడ్ సమీపంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో స్థానికులు సంచరిస్తున్న సమయంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అడవి లోపల విసిరేసినట్లు పడి ఉన్న మానవ అస్థిపంజరాలను చూసి తీవ్ర భయాందోళనకు గురైన వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కంకాసా పోలీస్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. అస్థిపంజరాలు పడి ఉన్న ప్రదేశానికి సరిగ్గా పైన ఉన్న ఒక పెద్ద చెట్టుకు నాలుగు ఉరితాళ్లలా వేలాడుతూ కనిపించాయి. అంతేకాకుండా ఆ చెట్టు కింద ఒక నైలాన్ బ్యాగ్ పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. లభ్యమైన అవశేషాల పరిమాణాన్ని బట్టి అందులో ఒకటి చిన్నపిల్లల అస్థిపంజరం అయి ఉండ...

అరక్కోణం-రేణిగుంట రైల్వే లైన్ ప్రాజెక్ట్ : పర్యాటకం, వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగాలకు గణనీయమైన ఊతమిస్తుందన్న పవన్ కల్యాణ్

Image
కేం ద్రం ప్రకటించిన అరక్కోణం-రేణిగుంట మధ్య మూడవ, నాల్గవ రైల్వే లైన్ ప్రాజెక్ట్, తిరుపతి, రాయలసీమ ప్రాంతాలకు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో పర్యాటకం, వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగాలకు గణనీయమైన ఊతమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రూ.10,021 కోట్ల విలువైన ఐదు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులలో భాగమైన ఈ విస్తరణ, రద్దీని తగ్గించడానికి, ప్రయాణికుల రాకపోకలను మెరుగుపరచడానికి, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలను కల్పించడానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. 10,021 కోట్ల విలువైన ఐదు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టుల ద్వారా భారతీయ రైల్వే వ్యవస్థ భారీ మార్పుకు సిద్ధమవుతోందని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీనివల్ల దాదాపు 540 కిలోమీటర్ల మేర కొత్త సామర్థ్యం సమకూరనుందని తెలిపారు. దీనివల్ల ప్రయాణికుల రాకపోకలు వేగవంతం కావడం, కార్యకలాపాలు సాఫీగా సాగడం, సరుకు రవాణా అనుసంధానం మెరుగుపడటం, అభివృద్ధికి కొత్త అవకాశాలు లభించడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి, అరక్కోణం-రేణిగుంట మధ్య 3వ, 4వ లైన్ల నిర్మాణం అత్యంత కీలకం. ఇది తిరుపతి, రాయలసీమ ప్రాంత...