Posts

Showing posts with the label హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మెలిసి రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయాలి !

Image
తె లుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో కలిసి ముందుకు సాగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు సూచించారు. అలయ్ బలయ్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దసరా సమ్మేళనం 2024 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఢంకా మోగించగా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మెలిసి రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయాలని అన్నారు. రాజకీయాలకీతంగా పరస్పరం సహకరించుకుని, ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. దేశంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అగ్రస్థానంలో నిలపాలని సీఎంలకు సూచించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా 2005లో అలయ్ బలయ్ ప్రారంభించామని తెలిపిన బండారు దత్తాత్రేయ.. ప్రేమ, ఆత్మీయత, ఐక్యత చాటిచెప్పాలన్నదే దీని లక్ష్యమని తెలిపారు. ఈసారి కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ అలయ్ బలయ్‌లో ప్రదర్శించామని తెలిపారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ...

అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదే 'అలయ్‍-బలయ్‍' !

Image
అ లయ్-బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమమని, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. దసరా సందర్భంగా బండారు దత్తాత్రేయ ఏటా నిర్వహించే 'అలయ్‍-బలయ్‍' కార్యక్రమానికి సంబంధించి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. ''అలయ్-బలయ్ రాజకీయ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం 19వ వసంతంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలను ఒక వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా అలయ్‍-బలయ్‍ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలయ్‍-బలయ్‍ అనేది ఆత్మీయ సమ్మేళనం. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించేదే అలయ్‍-బలయ్‍'' అని దత్తాత్రేయ వివరించారు.

తెలంగాణకే ప్రత్యేకం బోనాల ఉత్సవాలు !

Image
హ ర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆషాడ మాసం బోనాల ఉత్సవాలలో భాగంగా చార్మినార్ శ్రీ భాగ్య లక్ష్మి, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు తెలంగాణలోనే ప్రత్యేకం అన్నారు. బోనాలు, బతుకమ్మ పండుగలు మహిళలు అమ్మవారిని ఆదరించే పండుగలన్నారు. పవిత్రమైన భావనతో బోనాలు సమర్పించి భవిషత్తుకు బంగారు బాట వేయాలని, అలాగే జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించాలన్నారు. తెలంగాణ ఇంకా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని, పాతబస్తీలో ప్రజలు శాంతి సామరస్యంగా, సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.