అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదే 'అలయ్-బలయ్' !
అలయ్-బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమమని, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. దసరా సందర్భంగా బండారు దత్తాత్రేయ ఏటా నిర్వహించే 'అలయ్-బలయ్' కార్యక్రమానికి సంబంధించి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. ''అలయ్-బలయ్ రాజకీయ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం 19వ వసంతంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలను ఒక వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా అలయ్-బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలయ్-బలయ్ అనేది ఆత్మీయ సమ్మేళనం. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించేదే అలయ్-బలయ్'' అని దత్తాత్రేయ వివరించారు.
Comments
Post a Comment