Posts

Showing posts with the label the system is being upgraded with the latest features to be useful in any situation

తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ మీ - సేవ విధానం

Image
తె లంగాణ ప్రభుత్వం వాట్సాప్ మీ - సేవ విధానంను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. దీంతో, రానున్న రోజుల్లో ఎమర్జెన్సీ సర్వీసులను ప్రారంభించేందుకు సిద్దమైంది. ముఖ్యమైన హెల్ప్ లైన్లను అనుసంధానం చేయటం ద్వారా ఏ సందర్భంలో అయినా ఉపయోగపడేలా తాజా మార్పులతో అప్ గ్రేడ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ మీ - సేవ విధానంలో కొత్త మార్పులు ప్రవేశ పెడుతోంది. 108, 102, 101, గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్ తదితర ముఖ్యమైన హెల్ప్‌ లైన్‌ నంబర్లన్నింటినీ లింక్‌ చేయనున్నారు. పెద్ద సంఖ్యలో లబ్దిదారులు డిజిటల్ సర్వీసులు అందుకున్నారు. దీని ద్వారా గతంలో వలే మీ-సేవ కేంద్రాల ఎదుట క్యూ కట్టే అవసరం లేకుండా సేవలను ప్రజల వద్దకే తీసుకొచ్చింది. మొత్తం పదికి పైగా ప్రభుత్వ శాఖలకు చెందిన 581 రకాల సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. 80969 58096 వాట్సప్‌ నంబర్‌ ద్వారా నిర్విరామంగా 24 గంటలూ పౌర సేవలు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మెసేజ్ ద్వారా ప్రజలు తమకు కావాల్సిన పూర్తి సమాచారం పొందే వెసులుబాటు కల్పించారు. వాట్సాప్ వినియోగం పైన అవగాహన లేని వారికి సులభంగా అర్...