Posts

Showing posts with the label North Korea Amasses $22 Billion in Foreign Exchange Revenue

22 బిలియన్ డాలర్ల విదేశీ మార్పిడి రాబడిని సమకూర్చుకున్న ఉత్తర కొరియా

Image
ఉ త్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తన వ్యూహాత్మక మార్గాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆర్థిక రాబడిని పొందుతున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విధించిన కఠిన నిబంధనలను దాటుకుని, 2022, 2025 మధ్య కాలంలో ఉత్తర కొరియా దాదాపు 22 బిలియన్ డాలర్ల విదేశీ మార్పిడి రాబడిని సమకూర్చుకుందని నిపుణుల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ఇది అంతకుముందు నాలుగు సంవత్సరాల రాబడి కంటే దాదాపు 4 రెట్లు అధికం కావడం గమనార్హం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, మాస్కోకు పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి అవసరమయ్యాయి. ఈ సమయంలో ఉత్తర కొరియా తన వద్ద ఉన్న సోవియట్ కాలం నాటి ఆర్టిలరీ నిల్వలను రష్యాకు సరఫరా చేయడం ప్రారంభించింది. 2025 ఆఖరు నాటికి రష్యా ఉపయోగిస్తున్న 122 ఎంఎం, 152 ఎంఎం ఆర్టిలరీ షెల్స్‌లో దాదాపు 50 శాతం ఉత్తర కొరియా నుంచే వెళ్లినట్లు అంచనా. అంతేకాకుండా, దాదాపు 16,000 నుండి 22,000 మంది ఉత్తర కొరియా సైనికులను రష్యా తరఫున సహాయంగా పంపడం ద్వారా, ప్రతి సైనికుడికి నెలకు 2,000 డాలర్ల చొప్పున భారీ మొత్తం నార్త్ కొరియా ఆర్థిక వ్యవస్థకు సమకూరింది. కేవలం సాంప్రదాయ ఎగుమతులపైనే ఆధారపడకుండా, ఉత్తర కొ...