Posts

Showing posts with the label India AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ 2026 : ఆకట్టుకుంటున్న ఏఐ క్లినిక్ మోడల్

Image
ఢి ల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ 2026లో జియో పెవిలియన్‌ ఎంతో మందికి ఆకట్టుకుంది. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకంగా 'జియో ఆరోగ్య ఏఐ' మరింత ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్. దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించడానికి తీసుకొచ్చారు. వీడియో గమనించినట్లయితే ఒక వ్యక్తి అద్దం మాదిరిగా ఉన్న ఒక పరికరం ముందు నిలబడితే తక్కువ వ్యవధిలోనే వారి కళ్లు, చర్మ రంగు, ముఖ కవళికలు, ఇతర దృశ్య సూచనలను ఆధారంగా తీసుకుని అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత AI సిస్టమ్ ఈ డేటాను పరిశీలించి ఒక ప్రాథమిక ఆరోగ్య నివేదికను సిద్ధం చేస్తుంది. రోగులు తమ సమస్యలను వాయిస్ AI డాక్టర్‌కు మాటల ద్వారా కూడా వివరించవచ్చు. ఈ వ...

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Image
ఢి ల్లీలోని భారత్ మండపంలో ఐదు రోజుల పాటు జరిగే 'ఇండియా-ఏఐ  ఇంపాక్ట్ సమ్మిట్ 2026' సదస్సుతో పాటు 'ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో'ను అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిలో ఇటువంటి అంతర్జాతీయ AI సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి అధికారులు చెబుతున్నారు. ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయ AI ప్రమాణాలను రూపొందించడంలో భారత్ తన కీలక పాత్రను చాటుకోనుంది. సుమారు 100 కు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోడీ ఎక్స్‌పోలోని వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. ఈ ప్రదర్శనలో అత్యంత సామర్థ్యం గల 600 స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి 13 దేశాలు ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేసి అంతర్జాతీయ సహకారాన్ని చాటుతున్నాయి. ఈ సమ్మిట్‌ను పీపుల్ (ప్రజలు), ప్లానెట్ (గ్రహం), ప్రోగ్రెస్ (పురోగతి) అనే మూడు చక్రాల (థీమ్స్) ఆధారంగా రూపొందించారు. 7,000...