Ad Code

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ


ఢిల్లీలోని భారత్ మండపంలో ఐదు రోజుల పాటు జరిగే 'ఇండియా-ఏఐ  ఇంపాక్ట్ సమ్మిట్ 2026' సదస్సుతో పాటు 'ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో'ను అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిలో ఇటువంటి అంతర్జాతీయ AI సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి అధికారులు చెబుతున్నారు. ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయ AI ప్రమాణాలను రూపొందించడంలో భారత్ తన కీలక పాత్రను చాటుకోనుంది. సుమారు 100 కు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోడీ ఎక్స్‌పోలోని వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. ఈ ప్రదర్శనలో అత్యంత సామర్థ్యం గల 600 స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి 13 దేశాలు ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేసి అంతర్జాతీయ సహకారాన్ని చాటుతున్నాయి. ఈ సమ్మిట్‌ను పీపుల్ (ప్రజలు), ప్లానెట్ (గ్రహం), ప్రోగ్రెస్ (పురోగతి) అనే మూడు చక్రాల (థీమ్స్) ఆధారంగా రూపొందించారు. 7,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 10 ప్రధాన ఏరినాల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 16న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రదర్శన, ఫిబ్రవరి 17 నుంచి సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సదస్సు ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుంది. భారతదేశాన్ని గ్లోబల్ AI హబ్‌గా మార్చడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సులో ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు, దిగ్గజ టెక్ కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu