Posts

Showing posts with the label Former Minister YS Vivekananda Reddy case

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు : హైదరాబాద్ సీబీఐ కోర్టులో తేల్చుకోవాలని సూచించిన సుప్రీంకోర్టు

Image
ఆం ధ్రప్రదేశ్ లో ఏడేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించగా దాన్ని వ్యతిరేకిస్తూ మరిన్ని అంశాలపై దర్యాప్తు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి కోరడం జరిగింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఆమె ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ట్రయల్ కోర్టు తీర్పు తర్వాత కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమెకు అక్కడా ఊరట దక్కలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య 2019లో జరిగింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. నాలుగేళ్ల తర్వాత దాన్ని పూర్తి చేసి అనంతరం గతేడాది సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. అనంతరం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైదరాబాద్ సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అనంతరం సీబీఐ కోర్టుకు వెళ్లిన సునీత.. తన తండ్రి హత్య కేసులో చాలా అంశాల్ని సీబీఐ వదిలేసిందని పేర్కొంది. అయ...