Posts

Showing posts with the label యాడ్స్ లేకుండా ప్లే పాస్ !

యాడ్స్ లేకుండా ప్లే పాస్ !

Image
స్మార్ట్‌ఫోన్ కొన్నారంటే రకరకాల యాప్స్ ట్రై చేయడం యూజర్లకు అలవాటు. ప్రతీ అవసరానికి ఓ యాప్ డౌన్‌లోడ్ చేస్తూ ఉంటారు. గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు థర్డ్ పార్టీ స్టోర్స్‌లో కూడా యాప్స్ ఉంటాయి. అయితే థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడం రిస్కే. అందుకే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ ఇన్‌స్టాల్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. గూగుల్ ప్లే స్టోర్‌లో వేలాది యాప్స్ ఉంటాయి. చాలావరకు యాప్స్‌లో యాడ్స్ ఉంటాయి. యాప్ ఇన్‌స్టాల్ చేసేప్పుడు Contains Ads అనే సమాచారం కనిపిస్తుంది. ఈ యాడ్స్ వద్దనుకుంటే ప్రీమియం వర్షన్ కొనాల్సి ఉంటుంది. ప్రీమియం వర్షన్ సబ్‌స్క్రైబ్ చేసిన వారికి యాడ్స్ ఉండవు. ఎక్కువ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గూగుల్ ప్లేస్టోర్‌లో ప్లే పాస్ సెక్షన్ లాంఛ్ చేసింది. ఇందులో 1,000 పైగా గేమ్స్, యాప్స్ అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా అందుబాటులో ఉంటాయి. ప్రీమియం ఫీచర్స్ కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం ప్రతీ నెలా లేదా ఏడాదికోసారి ఛార్జీలు చెల్లించాలి. ప్లే పాస్ కలెక్షన్‌లో స్పోర్ట్స్, పజిల్స్, Jungle Adventures, World Cricket Battle 2, Monument Valley లాంటి యాక్షన్ గేమ్స్ లాంటి యాప్స్ ఉన్నాయి. ...