Ad Code

యాడ్స్ లేకుండా ప్లే పాస్ !


స్మార్ట్‌ఫోన్ కొన్నారంటే రకరకాల యాప్స్ ట్రై చేయడం యూజర్లకు అలవాటు. ప్రతీ అవసరానికి ఓ యాప్ డౌన్‌లోడ్ చేస్తూ ఉంటారు. గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు థర్డ్ పార్టీ స్టోర్స్‌లో కూడా యాప్స్ ఉంటాయి. అయితే థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడం రిస్కే. అందుకే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ ఇన్‌స్టాల్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. గూగుల్ ప్లే స్టోర్‌లో వేలాది యాప్స్ ఉంటాయి. చాలావరకు యాప్స్‌లో యాడ్స్ ఉంటాయి. యాప్ ఇన్‌స్టాల్ చేసేప్పుడు Contains Ads అనే సమాచారం కనిపిస్తుంది. ఈ యాడ్స్ వద్దనుకుంటే ప్రీమియం వర్షన్ కొనాల్సి ఉంటుంది. ప్రీమియం వర్షన్ సబ్‌స్క్రైబ్ చేసిన వారికి యాడ్స్ ఉండవు. ఎక్కువ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గూగుల్ ప్లేస్టోర్‌లో ప్లే పాస్ సెక్షన్ లాంఛ్ చేసింది. ఇందులో 1,000 పైగా గేమ్స్, యాప్స్ అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా అందుబాటులో ఉంటాయి. ప్రీమియం ఫీచర్స్ కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం ప్రతీ నెలా లేదా ఏడాదికోసారి ఛార్జీలు చెల్లించాలి. ప్లే పాస్ కలెక్షన్‌లో స్పోర్ట్స్, పజిల్స్, Jungle Adventures, World Cricket Battle 2, Monument Valley లాంటి యాక్షన్ గేమ్స్ లాంటి యాప్స్ ఉన్నాయి. వీటితో పాటు Utter, Unit Converter, AudioLab, Photo Studio Pro లాంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియాతో పాటు 59 దేశాలకు చెందిన డెవలపర్స్ రూపొందించిన 1,000 పైగా యాప్స్‌ని ప్లే పాస్ ఆఫర్ చేస్తుంది. ప్లే పాస్ వన్ మంత్ ట్రయల్ ఆఫర్ ఉంది. నెలకు రూ.99 చెల్లించాలి. లేదా ఏడాదికి రూ.889 ధరకు యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. లేదా నెలకు రూ.109 ప్రీపెయిడ్ వన్ మంత్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. గూగుల్ ఫ్యామిలీ యాప్‌లో రిజిస్టర్ అయినవారు ప్లే పాస్ సబ్‌స్క్రిప్షన్‌ను ఐదుగురితో షేర్ చేసుకోవచ్చు. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి సబ్‌స్క్రిప్షన్స్ తీసుకొని సినిమాలు, షోస్ యాడ్స్ లేకుండా చూసే అవకాశం ఉన్నట్టు, గూగుల్ ప్లే స్టోర్‌లో ప్లే పాస్ తీసుకొని 1,000 పైగా యాప్స్‌ని యాడ్స్ లేకుండా ఉపయోగించుకోవచ్చు. యాప్స్‌లో వచ్చే యాడ్స్‌తో ఇబ్బందిపడేవారికి ఈ సబ్‌స్క్రిప్షన్ ఉపయోగపడుతుంది. ప్లే పాస్ ఫీచర్ దేశమంతా యూజర్లకు అందుబాటులోకి రానుంది. రకరకాల యాప్స్, గేమ్స్ రూపొందించే ఇండియన్ డెవలపర్స్‌కు ప్లే పాస్ ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుందని, తమ యూజర్ బేస్‌ను ప్రపంచ దేశాలకు విస్తరించుకోవచ్చని గూగుల్ ఇండియా తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu