త్వరలో వన్‌ప్లస్ నుంచి నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్
గ్లోబల్ మార్కెట్లో వన్‌ప్లస్ నుంచి ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే విడుదలపై సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే టిప్‌స్టర్ డెబయాన్ రాయ్ ఈ ఫోన్ ఇటీవలే గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపించినట్లు చెప్పారు. ఈ లిస్టింగ్ ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఫోన్ 3 కూడా ఇదే చిప్‌ను కలిగి ఉంది. అయితే గీక్‌బెంచ్ లిస్టింగ్ ఆధారంగా సింగిల్ కోర్ టెస్ట్‌లో 2019 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్‌లో 6503 పాయింట్లు పొందినట్లు తెలిసింది. ఈ లిస్టింగ్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. బ్యాటరీ వివరాలు వెల్లడి కాలేదు. అయితే 7000mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ 9000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ఇది 165Hz రీఫ్రెష్ రేట్‌తో 1.5k OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిప్‌సెట్ 12GB LPDDR5x ర్యామ్, UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుందని సమాచారం. దీనిలో వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ రూ.35000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Comments
Post a Comment