Posts

Showing posts with the label OnePlus Nord 6 Smartphone Coming Soon

త్వరలో వన్‌ప్లస్‌ నుంచి నార్డ్‌ 6 స్మార్ట్‌ఫోన్‌

Image
గ్లో బల్‌ మార్కెట్లో వన్‌ప్లస్‌ నుంచి ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో వన్‌ప్లస్‌ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే విడుదలపై సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే టిప్‌స్టర్‌ డెబయాన్‌ రాయ్‌ ఈ ఫోన్‌ ఇటీవలే గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌లో కనిపించినట్లు చెప్పారు. ఈ లిస్టింగ్‌ ఆధారంగా వన్‌ప్లస్‌ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 4 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన నథింగ్‌ ఫోన్‌ 3 కూడా ఇదే చిప్‌ను కలిగి ఉంది. అయితే గీక్‌బెంచ్ లిస్టింగ్ ఆధారంగా సింగిల్‌ కోర్‌ టెస్ట్‌లో 2019 పాయింట్లు, మల్టీ కోర్‌ టెస్ట్‌లో 6503 పాయింట్లు పొందినట్లు తెలిసింది. ఈ లిస్టింగ్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. బ్యాటరీ వివరాలు వెల్లడి కాలేదు. అయితే 7000mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ 9000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ఇది 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో 1.5k OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిప్‌సెట్‌ 12...