దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి ఆల్టో !


భారతదేశంలో పాపులర్ కార్లు అంటే మారుతి సుజుకి వ్యాగన్ఆర్, హ్యుందాయ్ ఐ10 లైనప్, మారుతి సుజుకి స్విఫ్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో వంటి మోడల్స్ గుర్తొస్తాయి. అయితే అత్యధికంగా అమ్ముడవుతున్న వెహికల్స్ లిస్ట్‌లో చాలా కాలం పాటు టాప్ ప్లేస్‌లో ఉన్న కారుగా మారుతి సుజుకి ఆల్టో రికార్డు క్రియేట్ చేసింది. భారతదేశంలో 5 మిలియన్ (50 లక్షల) యూనిట్ల అమ్మకాలు సాధించిన ఏకైక వెహికల్ లైనప్ ఇది. 2000లో లాంచ్ అయిన ఈ హ్యాచ్‌బ్యాక్, ఇప్పటి వరకు దాదాపు 5.06 మిలియన్ యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. 2000 నుంచి 2022 మధ్య 17 సంవత్సరాల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి ఆల్టో నిలిచింది. అంటే ఈ మోడల్‌కు మార్కెట్లో ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో అంచనా వేయవచ్చు. మన దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న రెండో కారు హ్యుందాయ్ i10. ఈ వెహికల్ 3.3 మిలియన్ యూనిట్ల సేల్స్ మార్క్ దాటింది. కానీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ఆల్టో కంటే చాలా వెనుకబడి ఉంది. మారుతి సుజుకి ఆల్టో 800 మోడల్ 2000లో లాంచ్ కాగా, మారుతి సుజుకి ఆల్టో K10 2010లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ లైనప్‌లో ఆల్టో K10 మాత్రమే మార్కెట్లో ఉంది. 2023 ఏప్రిల్ 1 నుంచి భారత్‌లో BS6 ఫేజ్ 2 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది, లాభాలు తగ్గుతాయి. అందుకే ఆర్థికంగా లాభదాయకంగా ఉండదు కాబట్టి మారుతి సుజుకి ఆల్టో 800 వేరియంట్‌ను కంపెనీ 2023 మార్చిలో నిలిపివేసింది. మారుతి సుజుకి ఆల్టో K10 ధర రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ వెహికల్ 1.0-లీటర్ K10C పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 67PS మ్యాగ్జిమం పవర్, 89Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMT ఆప్షన్‌తో వస్తుంది. 5-స్పీడ్ MTతో వచ్చే CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 57 PS గరిష్ట శక్తి, 82Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి ఆల్టో K10 కారు మార్కెట్లో రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి S-ప్రెస్సోకు గట్టి పోటీ ఇస్తోంది.


Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం