గూగుల్ ఉచిత ఏఐ కోర్సులు !
గూగుల్ పూర్తి ఉచితంగా కొన్ని రకాల ఆన్లైన్ ఏఐ కోర్సులు తీసుకొచ్చింది. విద్యార్థులతో పాటు ప్రొఫెషన ఈ కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు. దీనివల్ల స్కిల్స్ అప్‌గ్రేడ్ అవుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంట్రడక్షన్ టు లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ కోర్సులో దాని పేరుకు తగిన విధంగానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి ఉంటుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉపయోగం ఏమిటి? వాటిని ఎలాంటి సందర్భాల్లో వాడాలి? ప్రాంప్ట్ ట్యూనింగ్ ఎలా చేయాలి? అనే విషయాలను ఈ కోర్సులో మనకు నేర్పిస్తారు. ఇంట్రడక్షన్ టు రెస్పాన్సిబుల్ ఏఐ కోర్సులో రెస్పాన్సిబుల్ ఏఐ కాన్సెప్ట్ గురించి వివరిస్తారు. గూగుల్ తమ ప్రొడక్టుల్లో ఈ ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ టెక్నాలజీని ఏ విధంగా అమలు చేస్తుందనే వివరాలను ఇందులో తెలుపుతారు. జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ కోర్సు ద్వారా జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, రెస్పాన్సిబుల్ ఏఐ టెక్నాలజీలను సులువుగా మనం నేర్చుకోవచ్చు. ఇంట్రడక్షన్ టు ఇమేజ్ జనరేషన్ కోర్సులో థియరీతోపాటు ఇమేజ్ జనరేషన్ గురించి మనకు నేర్పిస్తారు. వెర్టెక్స్ ఏఐ ట్రైనింగ్, డిప్లాయిమెంట్ గురించి తెలియజేస్తారు. ఎన్ కోడర్ డీకోడర్ ఆర్కిటెక్చర్ కోర్సులో ‘మెషీన్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్’ గురించి మనకు నేర్పిస్తారు. దీనిని ఉపయోగించి సీక్వెన్స్-టు-సీక్వెన్స్ టాస్క్‌లు ఎలా పూర్తి చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఇచ్చిన పూర్తి సమాచారానికి సారాంశం చెప్పడం, ఒక భాషలోని టెక్ట్స్‌ను మరోభాషలోకి అనువాదం చేయడం లాంటి టాస్క్‌లను ఎలా పూర్తి చేయాలో ఇందులో మనకు నేర్పుతారు. అటెన్షన్ మెకానిజం కోర్సులో భాగంగా ఇన్పుట్ సీక్వెన్స్‌లోని నిర్దిష్ట భాగాలపై ఫోకస్ చేసేందుకు న్యూరల్ నెట్‌వర్క్‌ను ఏ విధంగా ఎనేబుల్ చేయాలి? అనే టెక్నిక్లను ఈ కోర్సులో మనకు నేర్పిస్తారు. క్రియేట్ కోర్సులో ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్స్ గురించి, ఎన్కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్ గురించి మనకు నేర్పిస్తారు. ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ స్టూడియో కోర్సులో జనరేటివ్ ఏఐ స్టూడియో గురించిన ప్రాథమిక అంశాలను మనకు తెలియజేస్తారు. దీనిని ఉపయోగించి మనం యాప్‌ల కోసం కస్టమైజ్డ్ జనరేటివ్ ఏఐ మోడల్స్‌ను రూపొందించుకోవచ్చు. అలాగే ప్రోటోటైప్ మోడల్స్‌ను కూడా తయారు చేయొచ్చు.
Comments
Post a Comment