Posts

Showing posts with the label జనరేటివ్ ఏఐ

భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తరించనున్న ఎరిక్సన్‌ !

Image
స్వీ డన్‌కి చెందిన టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్‌ భారత్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. కృత్రిమ మేథ (ఏఐ), జనరేటివ్‌ ఏఐ, నెట్‌వర్క్‌ ఏపీఐలు, 6జీ టెక్నాలజీ అభివృద్ధి మొదలైన వాటిపై దృష్టి పెట్టనుంది. ఇందుకోసం గణనీయంగా ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) 2024లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ భారత విభాగం హెడ్‌ ఆండ్రెస్‌ విసెంటి ఈ విషయాలు తెలిపారు. 1994లో నుంచి భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తున్నామని, అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఇది కూడా ఒకటని వివరించారు. 5జీ సాంకేతికతను వినియోగంలోకి తేవడంలో భారత్‌ వేగంగా పనిచేసిందని ఆండ్రెస్‌ తెలిపారు. కేవలం 22 నెలల్లోనే అయిదు లక్షల పైగా బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా 90 శాతం మేర కవరేజీ సాధించిందని చెప్పారు. దీంతో నెట్‌వర్క్‌ పనితీరుకు సంబంధించి భారత్‌ 86వ స్థానం నుంచి 16వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు. టెలికం దిగ్గజాలు భారతి ఎయిర్‌టెల్, జియోతో ఎరిక్సన్‌కి గతంలో ఒప్పందాలు ఉన్నాయి. ఇటీవలే 4జీ, 5జీ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌నకు సంబంధించి వొడాఫోన్‌ ఐడియాతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. ప...

గూగుల్ ఉచిత ఏఐ కోర్సులు !

Image
గూ గుల్ పూర్తి ఉచితంగా కొన్ని రకాల ఆన్​లైన్​ ఏఐ కోర్సులు తీసుకొచ్చింది. ​ విద్యార్థులతో పాటు ప్రొఫెషన ఈ కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు. దీనివల్ల స్కిల్స్ అప్​గ్రేడ్ అవుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంట్రడక్షన్ టు లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ కోర్సులో దాని పేరుకు తగిన విధంగానే లార్జ్ లాంగ్వేజ్​ మోడల్స్ గురించి ఉంటుంది. లార్జ్ లాంగ్వేజ్​ మోడల్స్ ​ ఉపయోగం ఏమిటి? వాటిని ఎలాంటి సందర్భాల్లో వాడాలి? ప్రాంప్ట్​ ట్యూనింగ్ ఎలా చేయాలి? అనే విషయాలను ఈ కోర్సులో మనకు నేర్పిస్తారు. ఇంట్రడక్షన్ టు రెస్పాన్సిబుల్ ఏఐ కోర్సులో రెస్పాన్సిబుల్​ ఏఐ కాన్సెప్ట్ గురించి వివరిస్తారు. గూగుల్ తమ ప్రొడక్టుల్లో ఈ ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ టెక్నాలజీని ఏ విధంగా అమలు చేస్తుందనే వివరాలను ఇందులో తెలుపుతారు. జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ కోర్సు ​ ద్వారా జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్​ మోడల్స్​, రెస్పాన్సిబుల్​ ఏఐ టెక్నాలజీలను సులువుగా మనం నేర్చుకోవచ్చు. ఇంట్రడక్షన్ టు ఇమేజ్ జనరేషన్ కోర్సులో థియరీతోపాటు ఇమేజ్ జనరేషన్​ గురించి మనకు నేర్పిస్తారు. వెర్టెక్స్​ ఏఐ ట్రైనింగ్​, డిప్లాయిమెంట్​ గురించి తెలియజేస్తారు. ఎన్ కోడర్ డీకోడర్ ఆర...