షియోమీ 14 అల్ట్రా ఫోన్‌ విడుదల !

దేశీయ మార్కెట్లో షియోమీ 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. తొలిసారిగా షియోమీ తన అల్ట్రా మోడల్‌ను ఆవిష్కరించింది. గత నెలలో నిర్వహించిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ కాగా తాజాగా భారత్‌లో విడుదల అయ్యాయి. నిన్న షియోమీ నిర్వహించిన కార్యక్రమంలో షియోమీ 14 కూడా విడుదల అయింది. షియోమీ 14 అల్ట్రా మోడల్‌ 6.73 అంగుళాల LTPO అమోలెడ్ మైక్రో కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 3200*1440 పిక్సల్‌ సహా 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ అయింది. మరియు 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. అల్ట్రా మోడల్ అక్టా కోర్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ 16GB LPDDR5X ర్యామ్‌ మరియు గరిష్ఠంగా 1TB UFS 4.0 ఇన్‌బిల్ట్‌ స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆథారిత HyperOS పైన పనిచేస్తుంది. ఈ షియోమీ 14 అల్ట్రా మోడల్‌ వెనుకవైపు క్వాడ్‌ కెమెరా సెటప్‌తో వచ్చింది. వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT900 ప్రైమరీ కెమెరా, 3.2x ఆప్టికల్‌ జూమ్‌ మరియు 5x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP సోనీ IMX858 కెమెరాలను కలిగి ఉంది. మరియు 50MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. షియోమీ 14 అల్ట్రా మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ 90W వైరడ్‌, 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, వైఫై, బ్లూటూత్‌ 5.4, NFC, GPS, NaVIC, USB-C పోర్టును కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెన్స్‌తో విడుదల అయింది. షియోమీ 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 16GB ర్యామ్‌ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ వేరియంట్ ధర రూ.99,999 గా ఉంది. ఏప్రిల్‌ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి షియోమీ అధికారిక వెబ్‌సైట్‌, ఇతర షియోమీ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు కార్డుల ద్వారా రూ.5000 తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఎక్స్చేంజీ ద్వారా రూ.5000 తగ్గింపు : దీంతోపాటు ఎక్స్చేంజ్‌ (Xiaomi 14 Ultra Sale) చేయడం ద్వారా రూ.5000 తగ్గింపును పొందవచ్చు. ఈ అల్ట్రా మోడల్‌ హ్యాండ్‌సెట్లు బ్లాక్‌ మరియు వైట్‌ రంగుల్లో లభిస్తాయి. దీంతోపాటు మూడు నెలలపాటు యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తున్నట్లు షియోమీ పేర్కొంది. దీంతోపాటు ఈ షియోమీ 14 సిరీస్ విడుదల వేడుకలో షియోమీ సంస్థ రిజర్వ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ పైన ప్రకటన చేసింది. రూ.9,999 చెల్లించి ఈ రిజర్వ్‌ ఎడిషన్‌ ఫోన్‌ను ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. మార్చి 11 నుంచి ఈ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8 నుంచి ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం