జూలై 18న ఒప్పో రెనో 8 సిరీస్ విడుదల


ఒప్పో రెనో 8, రెనో 8 ప్రో లాంచ్ తేదీని అధికారికంగా ధృవీకరించారు. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ జూలై 18న సాయంత్రం 6 గంటలకు అధికారికంగా అందుబాటులోకి రానుంది. లాంచ్ ఈవెంట్ కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌లలో లైవ్ ఈవెంట్ జరుగనుంది. చైనాలో ఈ సిరీస్‌లో Oppo Reno 8, Oppo Reno 8 Pro, Oppo Reno 8 Pro Plus మూడు మోడల్‌ స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. భారత్ Oppo Reno 8, Oppo Reno 8 Pro అనే రెండు మోడళ్లలో మాత్రమే రానుంది. భారత మార్కెట్లో రెనో 8 ప్రో, రెనో 8 ప్రో ప్లస్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉంది.  ఒప్పో రెనో 8 6.43-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్‌తో రానుంది. MediaTek డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌తో పాటు 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB, 12GB RAM + 256GB స్టోరేజ్ మూడు వేరియంట్‌లలో రానుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 12-ఆధారిత ColorOS 12.1 స్కిన్‌తో రన్ అవుతుంది. Reno 8 4500mAh బ్యాటరీతో రానుంది. నార్డ్ 2T మాదిరిగానే బాక్స్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. కెమెరా ముందు భాగంలో.. రెనో 8లో మారిసిలికాన్ X చిప్, వెనుక భాగంలో 50-MP ప్రైమరీ కెమెరా, 2-MP B&W సెన్సార్, 2-MP మాక్రో షూటర్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోల కోసం.. ఫోన్ ముందు భాగంలో 32-MP కెమెరాతో రానుంది. ఒప్పో రెనో 8 Pro ఫోన్ ఇటీవల చైనాలో లాంచ్ అయింది. ఒప్పో రెనో 8 Pro Plusకి అందించిన స్పెషిఫికేషన్లలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, MediaTek డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ రానుంది. గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజీ, Android 12-ఆధారిత ColorOS 12.1 స్కిన్, 4,500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, MariSilicon X-పవర్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రానుంది. రెనో 8 సిరీస్ ధరను ఇంకా వెల్లడించలేదు. కానీ, లీక్‌లు ఇప్పటికే ధరలను లీక్ చేశాయి. లీక్‌ల ప్రకారం.. రెనో 8 సిరీస్ రూ. 29,990 నుంచి ప్రారంభమై రూ. 33,990 వరకు ఉంటుంది. రెనో 8 ప్రో ఖరీదైనదే. రూ. 42,900 నుంచి లాంచ్ అవుతుందని అంచనా. రెండు మోడల్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందిస్తోంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం