Posts

Showing posts with the label while 230 members voted against

లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు

Image
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. 298 మంది సభ్యులు అనుకూలంగా, 230 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, జనాభా గణన లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును లోక్‌సభ శుక్రవారం తిరస్కరించింది. కాగా, లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందడానికి కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి 326 ఓట్లు అవసరం. సభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ సందర్భంగా మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. 298 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 230 మంది సభ్యులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో జనాభా గణన లేకుండానే నియోజకవర్గాల పునర్విభజనతో ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. సభలో జరిగిన ఓటింగ్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోవడం వల్ల, రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదం పొందలేదని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు.