Posts

Showing posts with the label warned that social media platforms

రాష్ట్రాలకు కేంద్ర ఇంటెలిజెన్స్ కీలక ఆదేశాలు జారీ !

Image
ప శ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో రాష్ట్రాల పోలీస్ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది. యుద్ధానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా విద్వేష ప్రచారాలు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. సమాజంలో ఉద్రిక్తతలు పెంచే విధంగా ఉండే ప్రసంగాలపై నిఘా పెట్టాలని, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్ గ్రూపుల్లో జరిగే ప్రచారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని, సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు.