Posts

Showing posts with the label services in the core urban areas of Hyderabad should be tailored to meet the needs of commuters

ఎంఎంటీఎస్ సర్వీసులపై సీఎం రేవంత్ సమీక్ష

Image
ఎం ఎంటీఎస్ సర్వీసులపై శానసమండలి హాల్‌ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌ లో ఏటికేడు ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్‌ ల సంఖ్య పెంచడంతో పాటు క్రమం తప్పకుండా సమయ పాలన పాటిస్తూ సర్వీసులు నడపాలని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉన్నందున అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని సీఎం తెలిపారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రధానంగా ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉండటంతో అక్కడకు రాకపోకలు సాగించేంద...