Posts

Showing posts with the label introduced the first part of the Justice Kurian Joseph Committee report

భారతదేశ సమాఖ్య వ్యసస్థకు నిర్మాణాత్మక పునః నిర్మాణం అవసరం

Image
త మిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ నివేదిక మొదటి భాగాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతూ భారత రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అన్ని అధికారాలను తన వద్దే పెట్టుకుందని, చట్టప్రకారం రావాల్సిన నిధులను దక్కించుకునేందుకు కేంద్రంతో పోరాటం చేయాల్సిన పరిస్థితిలోకి తమిళనాడును నెట్టివేశారని విమర్శించారు. భారత్​ లాంటి వైవిధ్యం ఉన్న దేశానికి సమాఖ్య వ్యవస్థ పునాది లాంటిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలపై ఎలాంటి గౌరవం లేకుండా కేంద్రమే అన్ని అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుందని ఆరోపించారు. రాష్ట్రాలను గౌరవించకుండా కేంద్రమే అన్ని అధికారాలను తన వద్దే పెట్టుకుందని విమర్శించారు. 'ఒక రాష్ట్రంగా మా ప్రజల కలలను నిజం చేసేందుకు మాకు అధికారాలు కూడా లేవు. సామాజిక న్యాయం, విద్య, వైద్యం, ఆర్థికం, మౌలిక సదుపాయల కల్పనలో చాలా అభివృద్ధి సాధించాం. కానీ నిధులు సహా కొన్ని హక్కుల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చే నిధులను దక్కించుకునేందుకు ప్రతీసారి పోరాడాల్సిన పరిస్థితిల్లో మనం ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు వారు ఇస్తుంటే...