Posts

Showing posts with the label Youth vandalizes hotel after arguing over not hot Porota

పొరోటా వేడిగా లేదని గొడవపడి హోటల్‌ను ధ్వంసం చేసిన యువకుడు

Image
కే రళలోని కోజికోడ్ లో పొరోటా వేడిగా లేదని హోటల్‌ యజమానితో గొడవపడి హోటల్‌ని ధ్వంసం చేశాడు ఒక యువకుడు. సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వెల్లికుళంగరకు చెందిన సాదిక్ అనే వ్యక్తికి చెందిన 'బిర్యానీ డేస్' అనే హోటల్‌పై ఈ దాడి జరిగింది. సాయంత్రం హోటల్‌కు వచ్చిన ఒక యువకుడు పొరోటా మరియు బీఫ్ రోస్ట్ ఆర్డర్ చేశాడు. తిన్న తర్వాత పొరోటా వేడిగా లేదని, ఆహారం రుచిగా లేదని గొడవ మొదలుపెట్టాడు. యజమాని సాదిక్ స్పందిస్తూ ఆహారాన్ని వెనక్కి తీసుకుంటామని లేదా డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పి యువకుడిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ యువకుడు వినకుండా హోటల్ బయటకు వెళ్లి, తిరిగి వచ్చి దాడికి దిగాడు. హోటల్ అద్దాలను పగులగొట్టి, సాదిక్‌ను వాటర్ బాటిల్‌తో కొట్టి తోసివేశాడు. గాయపడిన సాదిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.