Posts

Showing posts with the label Union Cabinet approves renaming Kerala

కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర

Image
కే రళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మంగళవారం ఉదయం కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయం (సేవా తీర్థం)లో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. కేరళ పేరు కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే అహ్మదాబాద్‌ మెట్రో ఫేజ్-2కు కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో పాటు జబల్‌పూర్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే విద్యుత్‌ రంగంలో సంస్కరణలకు, దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు, 14 ఏళ్ల బాలికులకు ఉచితంగా గర్దాసిల్‌ ఇంజెక్షన్‌ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మలయాళ భాషలో రాష్ట్రాన్ని ఇప్పటికే ‘కేరళం’ అని పిలుస్తారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న అన్ని భాషల్లోనూ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కోరుతూ 2024లోనే ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మలయాళీ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని క...