Posts

Showing posts with the label The Center has issued a notification changing the name of the Prime Minister's new building complex to Sevatirth

ప్రధాని కొత్త భవన సముదాయం పేరును సేవాతీర్థ్ గా మార్చుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ

Image
ఢి ల్లీలోని ప్రధాని కొత్త భవన సముదాయం పేరును సేవాతీర్థ్ గా మార్చుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటితో పాటు అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్ గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇదివరకే పలు రాష్ట్రాల్లోని రాజ్ భవన్ ల పేరును కేంద్రం లోక్ భవన్ లుగా మార్చింది. ఈ నేపథ్యంలో మిగతా వాటి పేర్లను మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనితో పాటు రేస్ కోర్స్ రోడ్డు పేరును లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చింది. రాజ్ భవన్ పేరు మార్చినట్లు నోటిఫికేషన్ రావడంతో హైదరాబాద్ లోని రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రికార్డులన్నింటిలోనూ లోక్ భవన్ పేరును ప్రచురించబోతున్నట్లు పేర్కొన్నారు. కాగా 2016లో కేంద్రం ప్రధాని నివాసం పేరును మార్చింది.