Posts

Showing posts with the label Sports Authority of India hostel

కొల్లం స్పోర్ట్స్ హాస్టల్‌లో ఇద్దరు ట్రైనీ బాలికలు ఆత్మహత్య !

Image
కే రళలోని కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ గదిలో గురువారం ఇద్దరు స్పోర్ట్స్ ట్రైనీలు ఉరివేసుకుని మరణించారు. కోజికోడ్‌కు చెందిన 17 బాలిక, తిరువనంతపురంకు చెందిన 15 ఏళ్ల బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం ట్రైనింగ్ సెషన్‌కు ఆ ఇద్దరు బాలికలు హాజరు కాకపోవడంతో ఇతర విద్యార్థినులకు అనుమానం వచ్చింది. వారు ఆ బాలికల రూమ్‌కు వెళ్లి పదే పదే తలుపు తట్టినా సమాధానం రాకపోవడంతో, హాస్టల్ అధికారులు తలుపు పగలగొట్టి చూశారు. గదిలో ఇద్దరు బాలికలు ఉరి వేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కోజికోడ్‌కు చెందిన 17 బాలిక అథ్లెటిక్ ట్రైనీ కాగా, తిరువనంతపురంకు చెందిన 15 ఏళ్ల బాలిక కబడ్డీ క్రీడాకారిణి. గది నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.