Posts

Showing posts with the label Princess Alexia

డచ్‌ రాకుమార్తెల హత్యకు కుట్ర : నిందితుడి అరెస్ట్‌

Image
డచ్ సింహాసనానికి వారసురాలైన 22 ఏళ్ల యువరాణి కాథరినా అమాలియా, 20 ఏళ్ల యువరాణి అలెక్సియా లక్ష్యంగా హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ చేసిన నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో హేగ్ నగరంలో 33 ఏళ్ల వ్యక్తిని పోలీస్‌ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రెండు గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గొడ్డలిపై ‘అలెక్సియా’, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ‘మొస్సాద్’, నాజీ నినాదమైన ‘సీగ్ హీల్’ వంటి పదాలు చెక్కి ఉండటం తీవ్ర కలకలం రేపింది. దాంతోపాటు ‘అమాలియా’, ‘అలెక్సియా’, ‘బ్లడ్‌బాత్’ అని రాసి ఉన్న చేతిరాత నోట్‌ను కూడా అధికారులు కనుగొన్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం తాజాగా వెల్లడించింది. నిందితుడి తరఫు న్యాయవాది కోర్టు విచారణకు ముందు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. కాగా డచ్ రాజకుటుంబం కూడా ఈ ఘటనపై తక్షణమే స్పందించలేదు.