Posts

Showing posts with the label Phosphatic and Potassic fertilizers

ఎరువులపై ఇచ్చే సబ్సిడీని పెంచిన కేంద్ర ప్రభుత్వం : రూ.41,534 కోట్ల రాయితీకి క్యాబినెట్ ఆమోదం

Image
దే శంలో వ్యవసాయ ఉత్పాదకాలను అందుబాటు ధరలలో ఉంచేందుకుగాను ఎరువులపై ఇచ్చే సబ్సిడీని పెంచింది. ఖరీఫ్ సీజన్‌లో పీ అండ్ కే (ఫాస్ఫేటిక్ అండ్ పొటాసిక్) ఎరువులపై రూ.41,534 కోట్ల రాయితీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఖరీఫ్ సీజన్‌కు ఈ సబ్సిడీ అమల్లో ఉంటుంది. డై-అమ్మోనియమ్ ఫాస్పేట్  ధరలు అంతర్జాతీయంగా పెరిగినా రైతులపై భారం పడకుండా ఉండేందుకు ధరలలో మార్పులు చేయలేదని వెల్లడించింది. దీంతో 50 కిలోల బ్యాగ్ ధర రూ.1,350గా కొనసాగనుంది. ఎరువులు, ముడిసరుకుల ధరల పోకడలకు అనుగుణంగా కేంద్రం సర్దుబాట్లు చేసింది. తాత్కాలిక సబ్సిడీ కేటాయింపును రూ.41,533.81 కోట్లుగా నిర్ధారించింది. ఇది ఖరీఫ్ 2025 సీజన్‌కు కేటాయించిన రూ.37,216.15 కోట్ల కంటే సుమారు రూ.4,317 కోట్లు అధికం. రైతులకు రాయితీతో కూడిన, అందుబాటు ధరలో ఎరువులు లభించేలా చూడటమే ఈ నిర్ణయం ముఖ్య లక్ష్యం. యూరియా, డీఏపీ, ఎన్ఓపీ, సల్ఫర్ వంటి కీలక ముడిసరుకుల అంతర్జాతీయ ధరలలోని ఇటీవలి మార్పులను పరిగణనలోకి తీసుకుని పీ అండ్ కే ఎరువులపై రాయితీ రేట్లను హేతుబద్ధీకరించడం కూడా దీని ఉద్దేశం. ఎన్బీఎస్  విధానం కింద ఆమోదించబడిన పోష...