Posts

Showing posts with the label People continue to use ATMs alongside UPI

దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు ? యూపీఐతో పాటు ఏటీఎంలను వినియోగిస్తున్న ప్రజలు

Image
యూ పీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏటీఎంలను వినియోగిస్తున్నారు. డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకుంటున్నారు. క్యాష్ అవసరమైనప్పుడు వెంటనే దగ్గల్లోని ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడం జరుగుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నా ఏటీఎం లావాదేవీలు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి.  ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుంది. ఆపరేటర్లు ఏటీఎంలో నగదు నింపడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నగదు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏటీఎంలలో నింపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రవాణా, భద్రత, నిర్వహణ, పర్యవేక్షణకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, సిబ్బంది వేతనాలు పెరగడంతో ఏటీఎంలో నగదు నింపేందుకు ఎక్కువ ఖర్చవుతుంది. ఏటీఎంలను వాడటం కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. దీని వల్ల ఆపరేటర్లకు ఆదాయం తగ్గుతుండగా.. నిర్వహణ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడవచ్చని కాన్పెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ హెచ్చరించింది. ఏటీఎంలకు నగదు రవాణా చేసే సంస్థలు, ఆపరేటర్లకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఏటీఎంలలో నింపే నగదులో భారీగా త...