Posts

Showing posts with the label Oil marketing companies announced

తగ్గిన కమర్షియల్ వంట గ్యాస్‌ ధర

Image
వా ణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు మరోసారి తగ్గాయి. 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఢిల్లీలో రూ.202, కోల్‌కతాలో రూ.209 మేర ధరను తగ్గించినట్లు చమురు మార్కెటింగ్‌ సంస్థలు వెల్లడించాయి. ఈ కొత్త ధరలు ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. తాజా సవరణతో కోల్‌కతాలో 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.2,872.50కు చేరింది. ఢిల్లీలోనూ ధర గణనీయంగా తగ్గింది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలకు ఈ తగ్గింపు కొంత ఊరటనివ్వనుంది. గత నెల జూలై 1న కూడా చమురు మార్కెటింగ్‌ కంపెనీలు కమర్షియల్‌ ఎల్‌పీజీ ధరలను దేశవ్యాప్తంగా తగ్గించాయి. హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,985.00 కు చేరింది. అంతకుముందు జూలైలో దీని ధర రూ.3,191.00 గా ఉండేది. తాజా రేట్ల తగ్గింపు తర్వాత విజయవాడలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర సుమారు రూ.2,954.50గా ఉంది.