Posts

Showing posts with the label Minister Seethakka Reviews Progress of Rural HAM Road Construction

గ్రామీణ హ్యామ్ రోడ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష

Image
తె లంగాణలో పట్టణ ప్రాంత రోడ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అందుకోసమే అత్యంత ఆధునికమైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో శనివారం పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దానకిషోర్, ఈఎన్సీ జోగారెడ్డి, సీఈలతో కలిపి గ్రామీణ హ్యామ్ రోడ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా హ్యామ్ మోడల్‌లో మొత్తంగా 6,703 గ్రామాల్లో 18,472 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. అందులో మొదటి విడత కింద 2,678 గ్రామాల్లో 7,450 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ, పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.మొదటి విడుతలో 90 శాతం పనులు ప్రస్తుతం ఉన్న రహదారుల ఆదునీకరణ పనులకే ప్రధాన్యమిస్తున్నామని వెల్లడించారు. దశాబ్దాలుగా రవాణా సౌకర్యం లేని 179 గ్రామాలకు తొలిసారిగా 934 కిలోమీటర్ల మేర బిటి, సిసి రోడ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న హ్యామ్ విధానాన్ని దేశమంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నందున మార్గదర్శకాలను అత్యంత సమగ్రంగ...