Posts

Showing posts with the label MTV launched on August 1

శాశ్వతంగా మూతపడిన 'ఎంటీవీ' మ్యూజిక్ ఛానెల్స్?

Image
నా లుగు దశాబ్దాలుగా కోట్లాది సంగీత ప్రియులకు వినోదాన్ని అందించిన ఎంటీవీమ్యూజిక్ ఛానెల్స్ శాశ్వతంగా మూతబడింది. పారామౌంట్ గ్లోబల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎంటీవీ, తమ అనుబంధంగా నడిచిన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో మ్యూజిక్ టెలివిజన్ ప్రపంచంలో ఒక కీలక అధ్యాయం ముగిసినట్టైంది.1981 ఆగస్టు 1న ఎంటీవీ ప్రారంభమైనప్పుడు ప్రసారమైన తొలి మ్యూజిక్ వీడియోనే చివరిసారిగా ఆన్ ఎయిర్ చేసింది. బగుల్స్ బృందం పాడిన 'వీడియో కిల్డ్ ది రేడియో స్టార్' పాటతోనే ఎంటీవీ తన ప్రయాణానికి ముగింపు పలకడం అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. న్యూ ఇయర్ ఈవ్ రోజున ఈ వీడియో ప్రసారం కావడంతో, సోషల్ మీడియాలో 'ఎంటీవీ మెమరీస్' పేరుతో అనేక పోస్టులు వెల్లువెత్తాయి. ఈ నిర్ణయానికి అనుగుణంగా యుకేలోని MTV Music, MTV 80s, MTV 90s, Club MTV, MTV Live వంటి ప్రముఖ ఛానెల్స్ పూర్తిగా ఆఫ్ ఎయిర్ అయ్యాయి.