Posts

Showing posts with the label Four Pakistani army personnel were killed and three others were injured in the attack

పాకిస్థాన్ భద్రత బలగాల కాన్వాయిపై దాడి చేసింది మేమే : బలూచిస్తాన్‌ లిబిరేషన్ ఆర్మీ ప్రకటన

Image
పా కిస్థాన్ భద్రత బలగాల కాన్వాయిపై ఫిబ్రవరి 22న దాడి చేసింది మేమేనని  బలూచిస్తాన్‌ లిబిరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన నలుగురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. పాక్‌ ఆక్రమణలో ఉన్న బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం కల్పించే వరకూ పోరాటం ఆపేది లేదని బలూచిస్తాన్‌ లిబిరేషన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ ఆజాద్ బలూచ్ తెలిపారు. అంతకుముందు బలూచిస్థాన్‌ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడింది. ఇటీవల ఆ సైన్యం జరిపిన దాడుల్లో 177 మందికి పైగా మృతిచెందారు. బలూచిస్తాన్‌ లిబిరేషన్ ఆర్మీకి వారికి ఎటువంటి సహాయక చర్యలు అందకుండా ఉండేందుకు రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్‌ను కట్ చేసింది. అయితే బలూచిస్తాన్‌లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్‌వర్క్ మెుత్తంగా 4 నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని పాక్ మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.