Posts

Showing posts with the label Fellow student is the mastermind in the rape case of a medical student

వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో సహ విద్యార్థి ప్రధాన సూత్రధారి

Image
ప శ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఫిర్దౌస్ షేక్‌గా గుర్తించారు. మరో ఐదుగురిని సహ నిందితులుగా పేర్కొన్నారు. సహ నిందితుల్లో బాధితురాలి ప్రియుడు అయిన సహ విద్యార్థి కూడా ఉండటం గమనార్హం. బాధితురాలి న్యాయవాది పార్థా ఘోష్ మాట్లాడుతూ సామూహిక అత్యాచార సంఘటనలో సహ విద్యార్థి ప్రధాన సూత్రధారి అని అన్నారు. ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిని అక్టోబర్ 10న ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ- ఆసుపత్రి వెలుపల ఉన్న అటవీ ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ ఘటనపై అధికార టీఎంసీని, సీఎం మమతా బెనర్జీని బీజేపీ టార్గెట్ చేసింది. కోల్‌కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన తర్వాత ఈ సంఘటన జరగడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.