Posts

Showing posts with the label సింక్రాన్ అనే టెక్ కంపెనీ

మెదడుతో అలెక్సాను కంట్రోల్ చేయొచ్చు ?

Image
మె దడు, కండరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి కోసం, పక్షవాత రోగుల కోసం మెదడులోని ఆలోచనలతో అలెక్సాను కంట్రోల్ చేసే విధంగా ఒక అత్యాధునిక బ్రెయిన్ చిప్‌ను సింక్రాన్ అనే టెక్ కంపెనీ రూపొందించింది. దాన్ని మెదడు నరాల వ్యాధితో బాధపడుతున్న 64 ఏళ్ల వృద్ధుడి మెదడు రక్తనాళంపై అమర్చి ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. అతడి మెదడులో రేకెత్తే ఆలోచనలను ఆ బ్రెయిన్ చిప్ గ్రహించి అమెజాన్‌ ఫైర్‌స్టిక్‌ టాబ్లెట్‌లోని సంబంధిత ఐకాన్‌లో యాక్టివిటీ జరిగేలా ప్రాంప్ట్‌ను పంపిస్తుంది. వీడియో కాల్ చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం, ఓటీటీ షోను స్ట్రీమ్ చేయడం, స్మార్ట్ హోం డివైజ్‌ను వాడటం, ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, పుస్తకాలు చదవడం వంటి ఆలోచనలు వచ్చినప్పుడు.. ఆ ఆలోచనను సదరు బ్రెయిన్ చిప్ ప్రాసెసింగ్ చేసి ఎలక్ట్రానిక్ సిగ్నల్ రూపంలోకి మారుస్తుంది. ఆ సిగ్నల్‌కు అనుగుణంగా అమెజాన్‌ ఫైర్‌స్టిక్‌ టాబ్లెట్‌లోని ఐకాన్‌ల ఎంపిక ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. మెదడు నరాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మ్యూజిక్ ప్లే చేయాలని ఆలోచిస్తే.. అమెజాన్‌ ఫైర్‌స్టిక్‌ టాబ్లెట్‌లోని మ్యూజిక్ ఐకాన్ ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది. వెంటనే మ్యూజిక్‌ను ప్లే చ...