Posts

Showing posts with the label విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

పోలీసు విచారణలో భారత హైకమిషనర్‌ పాల్గొనాలని కెనడా కోరింది, అందుకే వెనక్కి రప్పించాం : జైశంకర్‌

Image
భా రత దౌత్యవేత్తలపై కెనడా ప్రభుత్వ చర్యలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందించారు. పోలీసు విచారణలో భారత హైకమిషనర్‌ పాల్గొనాలని కెనడా కోరిందని, అందుకే మన హైకమిషనర్‌తోపాటు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించామని చెప్పారు. ఓ జాతీయ వార్తా ఛానెల్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆ దేశంతో సంబంధాలను ప్రస్తుతం అంచనా వేయడం కష్టమేనన్నారు. పోలీసు విచారణలో భారత హైకమిషనర్‌ పాల్గొనాలని కెనడా కోరింది. అందుకే మన హైకమిషనర్‌తోపాటు దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవడాన్ని ఎంచుకున్నాం. దౌత్యవేత్తల సంక్షేమం, భద్రతకు సంబంధించి కెనడాలో ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకోవడం కెనడాకు ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. అదే భారత్‌లో.. కెనడా దౌత్యవేత్తలు మాత్రం మన సైన్యం, పోలీసుల సమాచారాన్ని స్వేచ్ఛగా సేకరించడం, నిర్దేశిత పౌరులను కెనడాలో అడ్డుకునేందుకు మాత్రం ఎటువంటి చర్యలుండవు అని కెనడా తీరుపై జైశంకర్‌ మండిపడ్డారు. ''అక్కడా, ఇక్కడా వారి తీరు భిన్నంగా ఉంది. భారత్‌కు చెందిన నేతలు, దౌత్యవేత్తలను మీ పౌరులు బహిరంగంగా బెదిరిస్తున్నారు అని మ...

కొత్త పాస్‌పోర్ట్‌లు వచ్చేస్తున్నాయి !

Image
కొత్త ఈ-పాస్‌పోర్ట్ ఇంటిగ్రేటెడ్ చిప్‌తో వస్తుంది. సంబంధిత వ్యక్తికి చెందిన బయోమెట్రిక్ డేటా (ఫొటోగ్రాఫ్, వేలిముద్రలు) ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. దీని వల్ల భద్రత మెరుగుపడుతుందని, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాస్‌పోర్టులను నకిలీ చేయడం కష్టతరం అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. దీనికి సంబంధించి గత జూన్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీడీ దృష్టికి అనుగుణంగా 'ఈజ్ ఆఫ్ లివింగ్'ని మెరుగుపరిచే లక్ష్యంతో విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొంది. ఈజ్‌ని విపులీకరిస్తే E అంటే డిజిటల్ వ్యవస్థను ఉపయోగించి పౌరులకు మెరుగైన పాస్‌పోర్ట్ సేవలు అందించడం, A అంటే కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవా డెలివరీ, S అంటే చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి సులభతరమైన విదేశీ ప్రయాణం, E అంటే మెరుగుపరచబడిన డేటా భద్రత. ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా' లక్ష్యంలో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం గణనీయమైన పాత్ర పోషిస్తోందని జైశంకర్ అన్నారు. ఇందులో భాగంగానే mPassport పోలీస్ యాప్, mPassport సేవా మొబైల్ యాప్, డిజీలాకర్‌తో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాన్ని అ...