పోకో కొత్త ఫోన్ సేల్ ప్రారంభం !
పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో వుంటుంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ రూ.17,999గా నిర్ణయించారు. కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో పోకో ఎం4 ప్రో 5జీని కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై పోకో ఎం4 ప్రో 5జీ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ అందించింది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా...