Posts

Showing posts with the label డిప్యూటీ సీఎం

పిఠాపురంలో స్థలం కొన్న పవన్‌ కల్యాణ్‌ !

Image
ఆం ధ్రప్రదేశ్  డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిన్న స్థలం కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలను కొన్నారు. రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని.. పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని పవన్‌ కల్యాణ్‌ నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పారు. పిఠాపురంలో ఎకరం మార్కెట్‌ విలువ రూ.15-17 లక్షల మేర ఉంది. మరో పదెకరాల భూమిని కొనేందుకు జనసేన నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ !

Image
హై దరాబాద్ గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పంట కొనుగోళ్లపై మాట్లాడుతూ  ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని అన్నారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలను రైతులకు అందించాలని, వర్ష సూచనపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పంట బోనస్ పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను భట్టి తిప్పికొట్టారు. ‘ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తాం. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం. తడిచిన ధాన్యం కూడా కొంటున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటు. 15 రోజుల ముందుగానే ధాన్యం కొంటున్నాం. గతం కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా మేం ధాన్యం కొనుగోలు చేశాం.’ అని భట్టి తెలిపారు.