Posts

Showing posts with the label జమిలి ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యం

జమిలి ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యం : చిదంబరం

Image
ఇ ప్పట్లో 'ఒకే దేశం ఒకే ఎన్నికల' అమలు అసాధ్యమని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుత రాజ్యాంగ ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం ఐదు సవరణలైనా చేయాల్సి ఉంటుందని చిదంబరం అన్నారు. రాజ్యాంగ సవరణలను లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టేందుకు తగినంత సంఖ్యాబలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద లేదని అన్నారు. 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' ప్రతిపాదనను ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' ప్రతిపాదన బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకంగా ఉంది. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ప్రధానమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. తరచు జరిగే ఎన్నికలు దేశ ప్రగతికి అవరోధమవుతాయని అన్నారు. జమిలి ఎన్నికలు ఇప్పటి అవసరమని స్పష్టం చేశారు.