రేపు పోకో ఎం8 పవర్ స్మార్ట్ ఫోన్ లాంచ్

దేశీయ మార్కెట్లో రేపు పోకో ఎం8 పవర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 16GB ర్యామ్ మరియు 8000 mAh బ్యాటరీ వంటి భారీ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు పోకో పేర్కొంది. క్వాల్కమ్ ఎక్క లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon Gen 4 తో లాంచ్ అవుతుంది. ఇది సపోర్ట్ కలిగిన 4nm ప్రాసెసర్ మరియు ఇది 6,30,000 కంటే అధిక AnTuTu స్కోర్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను మరింత వేగంగా డ్రైవ్ చేయడానికి వీలుగా 16GB ర్యామ్ (8GB + 8GB) సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూలింగ్ కోసం పెద్ద గ్రాఫైట్ కూలింగ్ ఏరియా ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది మంచి వీడియోలు మరియు స్టన్నింగ్ ఫోటోలు అందిస్తుందని పోకో తెలిపింది. మంచి కలర్స్ మరియు విజువల్స్ కోసం ఈ ఫోన్ లో పెద్ద 6.9 ఇంచ్ AMOLED స్క్రీన్ ని పోకో ఆఫర్ చేసింది. ఇది FHD రిజల్యూషన్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz వంటి అదనపు ఫీచర్స్ తో పాటు చాలా గొప్ప రక్షణ అందించే గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే 8000 mAh పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, మరియు 22.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఇది కాకుండా IP65 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Hyper OS3 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. ఈ ఫోన్ 4 జనరేషన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మరియు 6 సంవత్సరాల సాఫ్ట్ వేర్ అప్‌డేట్ అందుకుంటుంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం